మెగా హీరో నాగ బాబు కొడుకు వరుణ్ తేజ్ ఇప్పుడు వరుస సినిమా లలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు నటిస్తున్న తాజా చిత్రం లేటేస్ట్ చిత్రం గని. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్‌కు జోడిగా బాలీవుడ్‌ బ్యూటీ సాయి ముంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుంది.ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తుండగా.. సిద్దు ముద్ద, అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విడుదలైన ఫస్ట్‌లుక్‌తో పాటు సినిమాలోని పాత్రలను పరియం చేస్తూ విడుదల చేస్తోన్న పోస్టర్‌లు 'గని'పై ఆసక్తిని కలిగించాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.


గని సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మెగా అభిమానులు. ఈ సినిమాను మార్చి 18న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ వచ్చిన అప్డేట్స్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మరో సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.స్పెషల్ సాంగ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. నిన్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‏కు సంబంధించి ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఐటెం పోస్టర్ రివీల్ చేస్తూ అందులో నటించే హీరోయిన్ ఎవరనేది సస్పెన్స్ గా ఉంచారు. ఆ హీరోయిన్ ఎవరనేది కనిపెట్టాలంటూ ప్రేక్షకులను కోరారు.


ఇంకేముందు గని సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోయేది ఆ హీరోయిన్.. ఈ బ్యూటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇందులో నటించే హీరోయిన్ మిల్కీబ్యూటీ తమన్నా అంటూ ఎక్కువ శాతం నెటిజన్స్ కామెంట్స్ చేస్తుండగా… మరికొందరు సమంత అంటున్నారు. ఈ పాటకు సంబంధించిన పూర్తి పోస్టర్‏ను ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. మరి ఈ సినిమా లో ఐటమ్ సాంగ్ లో ఎవరూ నటిస్తూన్నారు అన్నది ఆసక్తిగా మారింది.నవీన్ చంద్ర, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నదియా మరో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: