దిల్ రాజు తాను నిమ్రించిన సినిమానే భారీ రేంజ్ లో ప్రమోట్ చేస్తాడు. దాదాపు తన దగ్గర పనిచేసిన హీరోలందరికి తన సినిమా ప్రమోషన్స్ కు వాడేస్తాడు. అలాంటిది తన ఫ్యామిలీ హీరో సినిమా అంటే ఎలా ఉంటుంది. దిల్ రాజు ఫ్యామిలీ నుండి వస్తున్న ఆశిష్ హీరోగా వస్తున్న రౌడీ బోయ్స్ సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో ప్లాన్ చేశారు దిల్ రాజు. సినిమాలోని ఒక్కో పాటని ఒక్కో హీరోతో రిలీజ్ చేయిస్తున్నారు.

రౌడీ బోయ్స్ ట్రైలర్ ఎన్.టి.ఆర్ తో.. ఒక సాంగ్ ని అల్లు అర్జున్ తో రిలీజ్ చేయించిన దిల్ రాజు ఇప్పుడు ప్రభాస్ తో సినిమాలోని మరో సాంగ్ ని రిలీజ్ చేయించాడు. ఆశిష్ కోసం టాలీవుడ్ స్టార్స్ అందరిని ఫుల్లుగా వాడేస్తున్నాడు దిల్ రాజు. ఆ హీరోల ఫ్యాన్స్ అంతా కూడా రౌడీ బోయ్స్ సినిమా చూడాలని దిల్ రాజు తెగ ప్లాన్లు వేస్తున్నాడు. రౌడీ బోయ్స్ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తుంది. సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.

నిర్మాత ఫ్యామిలీ నుండి వస్తున్న హీరోగా ఆశిష్ రౌడీ బోయ్స్ సినిమాకు ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. సినిమాలో అనుపమ పరమేశ్వరన్ లిప్ లాక్ సినిమాపై సూపర్ బజ్ ఏర్పరచింది. తప్పకుండా ఫ్యాన్స్ యూత్ ఆడియెన్స్ అంతా ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారని. సినిమా వాళ్లకి మంచి ఎంటర్టైన్ అందిస్తుందని అంటున్నారు దిల్ రాజు. తారక్, అల్లు అర్జున్, ప్రభాస్ ఇలా ప్రతి ఒక్కరితో తన ఫ్యామిలీ హీరో సినిమాకు సపోర్ట్ గా నిలిచేలా చేస్తున్నాడు దిల్ రాజు. సంక్రాంతి కానుకగా నాగార్జున బంగార్రాజు, గల్లా అశోక్ హీరో సినిమాలకు పోటీగా రౌడీ బోయ్స్ సినిమా వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: