ఐకాన్ స్టార్ అయిన అల్లు అర్జున్ ఈ రోజున టాప్ స్టార్ గా కొనసాగుతున్నాడు.తన కెరీర్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ తన హార్డ్ వర్క్ తో ఈ రోజు ఈ స్థాయికి వచ్చాడని అందరికి తెలుసు.అయితే ఈయన కెరీర్ కు బ్రేక్ ఇచ్చిన సినిమా ఏది అంటే అది ఖచ్చితంగా దేశముదురు అనే చెప్పవచ్చు . పూరీ జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన దేశముదురు సినిమా ఇప్పటికి అల్లు అభిమానులు అస్సలు మర్చిపోలేరు.

అల్లు అర్జున్ కెరీర్ లో అత్యధిక కేంద్రాల్లో శత దినోత్సవం చుసిన సినిమాగాను మరియు ఆయన నట జీవితంలో డైరెక్ట్ గా సిల్వర్ జూబ్లీ జరుపుకున్న ఏకైన సినిమాగా దేశముదురు మంచి రికార్డ్ సాదించింది. అప్పట్లో బన్నీ కి యూత్ లో అంతగా ఫాలోయింగ్ అస్సలు లేదు. అయితే దేశముదురు సినిమా తర్వాత మాస్ ప్రేక్షకులు మరింత దగ్గర అయ్యారు బన్నీ.ఈ సినిమా 2007 జనవరి 12న విడుదల అయ్యి సంక్రాంతికి బంపర్ విజయం అందుకుంది.

ఈ సినిమాను డివివి దానయ్య తమ యూనివర్సల్ మీడియా పతాకంపై భగవాన్ జె సమర్పణలో నిర్మించారని తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో హన్సిక మోత్వానీ తొలిసారిగా తెలుగు తెరకు పరిచయం అయ్యిన విషయం అందరికి తెలిసిందే.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ సాధించి వరుస అవకాశాలను ఆమె అందుకుంది. ఈ సినిమాకు కథ మాటలు స్క్రీన్ ప్లే పూరీ జగన్నాథ్ అందించగా చక్రి అద్భుతమైన సంగీతం అందించారు.

సినిమా విజయంలో పాటలు కూడా ముఖ్య పాత్ర పోషించాయని చెప్పవచ్చు.. అప్పట్లో 400 థియేటర్ లలో విడుదల అయినా బన్నీ తొలిసినిమా ఇదే కావడం విశేషం.. వందకు పైగా థియేటర్ లలో శత దినోత్సవం చవి చూసిన ఈ సినిమా హైదరాబాద్ 70 ఎమ్ ఎమ్ లో రజతోత్సవం పూర్తి చేసుకుందని సమాచారం.. అల్లు అర్జున్ కెరీర్ లో ఈ సినిమా అత్యధిక రోజులు ప్రదర్శించిన సినిమాగా కూడా నిలిచి పోయింది.. బన్నీ ఈ సినిమాలో మొట్టమెదటగా సిక్స్ ప్యాక్ చూపించి యూత్ లో ఒక ట్రెండ్ సృష్టించ్చాడని చెప్పవచ్చు.. అంతలా బన్నీ కెరీర్ లో ఈ సినిమా విజయం సాధించి ఒక మైలు రాయిగా నిలిచి పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: