ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కోలీవుడ్ హీరో శింబుతో ప్రేమలో ఉన్నదన్న వార్తలు ఈమధ్య బాగా వైరల్ అయ్యాయి. శింబుతో ఈశ్వరన్ సినిమా చేసిన నిధి అగర్వాల్సినిమా టైం లో ఇద్దరు క్లోజ్ అయ్యారని.. ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే తన సినిమా హీరో ప్రమోషన్స్ లో నిధి ఆ రూమర్స్ పై అలాంటిది ఏమి లేదని స్పందించినా శింబుతో నిధి కలిసి ఉంటుందని వార్తలు గట్టిగా రావడంతో దానిపై నిధి అగర్వాల్ టీం స్పందించింది.

నిధి అగర్వాల్ పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని. దయచేసి అలాంటి వార్తలని ఎవరు నమ్మొద్దు.. ఆ వార్తలని ఎవరు స్ప్రెడ్ చేయొద్ధని నిధి టీం రియాక్ట్ అయ్యింది. అయితే నిధి టీం ఈ విషయంలో లేట్ అయ్యిందని చెప్పొచ్చు. శింబుతో నిధి లవ్.. డేటింగ్.. లాంటి వార్తలు దాదాపు నాలుగైదు రోజులుగా వస్తూనే ఉన్నాయి. ఇద్దరు కలిసి ఈశ్వరన్ సినిమాలో ఉన్న పిక్స్ కూడా ఆ వార్తలకు యాడ్ చేస్తూ వచ్చారు.

అయితే నిధి టీం మాత్రం ఈ రూమర్స్ ని ఖండించింది. ప్రస్తుతం నిధి తన కెరియర్ మీదే పూర్తి దృష్టి పెట్టిందని. తన ఫోకస్ మొత్తం సినిమాల మీదే ఉందని క్లారిటీ ఇచ్చారు. సవ్యసాచి, మిస్టర్ మజ్ ను, ఇస్మార్ట్ శంకర్ మూడు సినిమాలకే నిధి అగర్వాల్ టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ ఏర్పరచుకుంది. ప్రస్తుతం గల్లా అశోక్ తో హీరో సినిమాలో నటించిన నిధి ఆ సినిమాలో బాగానే గ్లామర్ షో చేసినట్టు తెలుస్తుంది. నిధి టీం క్లారిటీ ఇచ్చారు కాబట్టి శింబుతో నిధి అంటూ వస్తున్న వార్తలు ఆగుతాయో లేదో చూడాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాలో కూడా నిధి అగర్వాల్ నటిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: