మంచు లక్ష్మి తెలుగు ప్రేక్షకులలో ఈ పేరు వినని వారు అస్సలు ఉండరు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మోహన్ బాబు కుమార్తె గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వెండితెరపై పలు సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నది.

మంచు లక్ష్మి నిత్యం సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించి,తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి అలాగే తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను తన అభిమానులతో ఎప్పుడు కూడా పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఈమె ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కి సైతం గురి అవుతూ ఉంటుంది. అలాగే పలు సామాజిక అంశాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది మంచు లక్ష్మి.

ఇక తనపై ఎన్ని రకాల ట్రోలింగ్స్ జరిగినా కూడా అవన్నీ అస్సలు పట్టించుకోకుండా వెళ్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటేతాజాగా కరోనా విషయంలోనూ ఆమె వ్యవహారించిన శైలి మాత్రం నెటిజన్ లకు కోపం తెప్పించింది. అసలేం జరిగిందంటే.. ఇటీవలే మంచు లక్ష్మి కరోనా బారిన పడిన విషయం అందరికి తెలిసిందే. ఇదే విషయాన్ని మంచు లక్ష్మి స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించిందట. గో కరోనా గో అని గట్టిగా అరిచినా కూడా అది తనను పట్టుకుంది అంటూ కాస్త ఫన్నీగా చెప్తూ తనకు కరోనా సోకిన విషయాన్ని తెలిపిందట మంచులక్ష్మి. ఇది ఇలా ఉంటే తాజాగా మంచు లక్ష్మి కి కరోనా నెగిటివ్ రావడంతో కాస్త డిఫరెంట్ గా ఆలోచించి నెటిజన్ ల ట్రోలింగ్స్ కి గురయినట్లు తెలుస్తుంది.. తనకు నెగిటివ్ వచ్చిన విషయాన్ని తన అభిమానులతో ఈ విధంగా చెప్పుకొచ్చిందట.
అందరికీ నమస్కారం నాకు నెగిటివ్ వచ్చేసింది అంటూ తెగ సంబరపడిపోతూ మంచు లక్ష్మి చెప్పింది.. ఇక వెంటనే తన కూతురు అయిన విద్యా నిర్వాణకు లిప్ కిస్సు లు సైతం ఇచ్చింది. అందుకు సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియా ఖాతాలో కూడా పోస్ట్ చేసింది. అయితే ఆమెకు నెగిటివ్ రావడం సంతోషించాల్సిన విషయమే కానీ ఆమె చేస్తున్న పనులు మాత్రం సరైనవి కావు అంటూ నెటిజన్స్ తనపై బాగా ట్రోలింగ్ చేశారు. కరోనా నెగెటివ్ వచ్చినా కూడా చిన్న పిల్లతో అంత దగ్గరగా ఉంటూ ముద్దులు పెట్టడం సరికాదని అంటున్నారట నెటిజన్లు. ఇంకొందరు నెటిజన్లు అయితే మరో అడుగు ముందుకేసి మంచు లక్ష్మి ప్రవర్తనను బాగా ఏకిపారేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: