టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప డిసెంబర్ 17వ తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎంత సూపర్ డూపర్ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదటి రోజు నుంచి హిట్ టాక్ తో దూసుకుపోయింది ఈ సినిమా. అటు భారీ వసూళ్లను కూడా సాధించింది. కేవలం దక్షిణాది చిత్రపరిశ్రమలో మాత్రమే కాదు అటు బాలీవుడ్ లో కూడా సత్తా చాటింది ఈ సినిమా. ఏకంగా బాలీవుడ్ లో కూడా 100 కోట్ల వరకు ఈ సినిమా వసూళ్లు రాబట్టింది. ఇకపోతే  ఇటీవలే విడుదలైన పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటమ్ సాంగ్ లో ఊ అంటావా ఉహూ అంటావా అంటూ పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


 ఒక రకంగా చెప్పాలంటే టాలీవుడ్ ప్రేక్షకుల అందరికీ కూడా ఈ పాట మత్తెక్కించింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఈ పాట అలరిస్తుంది. అంతేకాకుండా ఎంతోమంది సోషల్ మీడియా స్టార్స్ ఇక ఈ పాట పై డాన్స్ చేసి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండటం గమనార్హం. ఇకపోతే సమంత డాన్స్ చేసి మత్తెక్కించిన ఊ అంటావా ఉహూ అంటావా పాటపై ఇప్పుడు యాంకర్ రష్మి డాన్స్ చేసి అందరికీ పిచ్చెక్కించింది. సంక్రాంతి సందర్భంగా ఈ టీవీ లో సరికొత్త ఈవెంట్ ప్లాన్ చేశారు అన్న విషయం తెలిసిందే.


 'అమ్మమ్మగారి ఊరు' అంటూ ఇక దీనికి ఒక టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి మూడు ప్రోమోలు విడుదలయ్యాయి. ఇక ఇప్పుడు నాలుగవ ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.. ఈ ప్రోమో లో భాగంగా యాంకర్ రష్మీ తన అదిరిపోయే హాట్ పర్ఫామెన్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఊ అంటావా  ఉహూ అంటావా అనే పాట పై ఎంతో రొమాంటిక్ డాన్స్ చేసి అదరగొట్టింది యాంకర్ రష్మి. ఇక ఈ పర్ఫామెన్స్ చూసిన తర్వాత వామ్మో రష్మీ ఏంటి ఇంత హాట్ గా పర్ఫామెన్స్ చేసింది అంటూ కామెంట్లు పెడుతున్నారు ఎంతోమంది. ఇక ఈ మొత్తం పర్ఫామెన్స్ చూడాల్సిందేఅంటూ అనుకుంటున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: