నాగార్జున మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్‌ ఇంకా స్టార్‌ రేసుకి దూరంగానే ఉన్నాడు. 'కరెంట్, చిలసౌ' సినిమాలతో ఓకే అనిపించుకున్నా మార్కెట్‌ పెంచుకోలేకపోయాడు. అయితే స్ట్రగులింగ్‌లోనే ఉన్న ఈ హీరో ఇప్పుడు సపోర్టింగ్‌ రోల్స్‌ కూడా చేస్తున్నాడు. సూపర్ హిట్‌ కోసం తీవ్రంగా కష్టపడుతోన్న ఈ హీరో నెక్ట్స్ రవితేజ 'రావణాసుర' సినిమాలో కీ రోల్ ప్లే చేయబోతున్నాడు. సుశాంత్ ఇంతకుముందు 'అల వైకుంఠపురములో' సపోర్టింగ్‌ రోల్ ప్లే చేశాడు. ఈ సినిమా క్రెడిట్‌ మొత్తం అల్లు అర్జున్, త్రివిక్రమ్‌కే వెళ్లిపోయినా, సుశాంత్‌కి పెద్దగా మైలేజ్‌ రాకపోయినా మరో సినిమాలో సపోర్టింగ్‌ క్యారెక్టర్‌కి ఓకే చెప్పాడు సుశాంత్. రవితేజ, సుధీర్ వర్మ కాంబినేషన్‌లో వస్తోన్న రావణాసుర' సినిమాలో రాముడిగా నటిస్తున్నాడు.

లీడ్‌ క్యారెక్టర్, సపోర్టింగ్‌ రోల్ అనే తేడా లేకుండా కెరీర్‌ బిగినింగ్‌ నుంచే డిఫరెంట్‌గా జర్నీ చేస్తున్నాడు రానా. తెలుగులో హీరోగా చేస్తూనే, హిందీలో సపోర్టింగ్‌ రోల్ చేసిన రానా 'బాహుబలి'లో నెగటివ్ రోల్ ప్లే చేశాడు. పాన్ ఇండియన్ మూవీగా రిలీజైన 'బాహుబలి'తో రానాకి నేషనల్‌ వైడ్‌ పాపులారిటీ వచ్చింది. రానా ఇప్పుడు 'భీమ్లానాయక్'లో సెకండ్ హీరో క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. మళయాళీ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్‌గా తెరకెక్కుతోందీ సినిమా. ఒరిజినల్‌ మూవీలో ఇద్దరు హీరోలకి ఈక్వల్‌ ప్రియారిటీ ఉన్నా, తెలుగులో పవన్‌ కళ్యాణ్‌ కోసం రానా క్యారెక్టర్ తగ్గించారనే విమర్శలున్నాయి.  కమర్షియల్‌ మూవీస్‌లో హీరోయిజంతో పాటు విలనిజం కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటోంది. పైగా స్టైలిష్‌ విలన్స్‌కి డిమాండ్‌ ఎక్కువ ఉంటోంది. ఇక ఓటీటీల ప్రభావం పెరిగాక స్టార్స్‌ కూడా చాలెంజింగ్ రోల్స్‌కి ఓటేస్తున్నారు. కొత్తగా ఉంటుందని నెగటివ్‌ రోల్స్‌లోనూ నటిస్తున్నారు.

'ఆర్.ఎక్స్.100'తో యూత్‌కి కనెక్ట్ అయిన కార్తికేయ, ఇంకా హీరోగా సాలిడ్ పొజిషన్‌కి వెళ్లలేదు. అయితే ఇలాంటి ఫేజ్‌లో కూడా మార్కెట్ సంపాదించుకోవాలి అనే లెక్కలు పక్కనపెట్టి, నెగటివ్ షేడ్స్‌ చూపిస్తున్నాడు. తమిళ్‌లో అజిత్ 'వలిమై' సినిమాలో విలన్‌గా నటించాడు కార్తికేయ. ఇక ఈ హీరో ఇంతకుముందు నాని 'గ్యాంగ్ లీడర్'లో కూడా విలన్‌గా నటించాడు. కానీ ఈ 'గ్యాంగ్‌లీడర్‌'లో కార్తికేయకి పెద్దగా మైలేజ్ రాలేదు.

ఆది పినిశెట్టికి తమిళ్లో యూనిక్‌ ఇమేజ్‌ ఉంది. డిఫరెంట్ క్యారెక్టర్స్‌ చేస్తాడనే గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తెలుగులో మాత్రం ఆదికి పెద్దగా మార్కెట్‌ లేదు. డబ్బింగ్ సినిమాలతో జనాల ముందుకొచ్చినా, స్ట్రయిట్ మూవీస్‌ చేసినా మార్కెట్‌ని ప్రభావితం చెయ్యలేదు. అయితే 'సరైనోడు'లో చేసిన విలన్ క్యారెక్టర్, 'రంగస్థలం'లో చేసిన కుమార్ బాబు క్యారెక్టర్స్‌తో ఆడియన్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.మరింత సమాచారం తెలుసుకోండి: