అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా విడుదల అయి ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలుసు.ఈ సినిమలో సమంత మొదటి సారి ఐటెం సాంగ్ చేసింది.ఊ అంటావా మామ.ఊఊ అంటావా మావా.అనే సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
సినిమా డిసెంబర్ 17న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.విడుదలకు ముందు ఎన్ని సమస్యలు ఎదురైనా కూడా అవన్నీ దాటుకుంటూ రిలీజ్ అయ్యింది పుష్ప.

పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది.మరి ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేస్తుంది అంటే ముందు అందరు కూడా ఆశ్చర్య పోయారు.
సమంత మొన్నటి వరకు మెయిన్ హీరోయిన్ గా నటించింది.సడన్ గా ఐటెం సాంగ్ లో నటించాలంటే దానికి సరైన కారణం కావాలి కదా
ప్రేరణ కూడా ఉండాలి కదా అయితే ఆ ప్రేరణను మాత్రం బన్నీ ఇచ్చాడని సమంత చెప్పుకొచ్చింది.

ఒక వైపు వ్యక్తిగతంగా విడాకులు తీసుకుని ఉన్న సమయంలో కెరీర్ కోసం ఇలాంటి సన్నివేశంలో తనకు ఈ సాంగ్ లో నటించే అవకాశం రావడం సామ్ ఒప్పుకుని ఆ సాంగ్ ను చేయడం.
ఆ సాంగ్ ఒక ఊపు ఊపేయడం అన్ని ఒకదాని తర్వాత ఒకటి వేగంగా జరిగి పోయాయి.
అయితే ఇప్పటి వరకు ఈ సాంగ్ కోసం సమంత ను సుకుమార్ ఒప్పించినట్టు అంతా అనుకుంటున్నారు అయితే ఈ పాటలో చేసేందుకు తనకు హామీ ఇచ్చిన అల్లు అర్జున్ కి ధన్యవాదాలు తెలిపిందట సమంత.

చాలా అడ్డంకులు ఏర్పడ్డాయి.పాట ఎలా ఉంటుందో అని భయపడి నేను సిద్ధంగా లేనని కానీ అల్లు అర్జున్ నన్ను కూచోపెట్టి పాట గురించి వివరించి ఒప్పించాడని చెప్పింది సమంత..బన్నీ ప్రోత్సాహం లేకుంటే నేను ఈ పాట కోసం ఒప్పుకునే దాన్ని కాదు అని సామ్ తెలిపిందట..సమంత పాటలో నర్తించడానికి ఇప్పటి వరకు సుకుమార్ మాత్రమేనని భావించిన అందరికి ఇప్పుడు ఫుల్ గా క్లారిటీ వచ్చింది.రంగస్థలం దర్శకుడి ప్రపోజల్ కి అంగీకరించే ముందు బన్నీ ఇచ్చిన భరోసా నమ్మకం వల్లనే ఈ పాటకు అంగీకరించిందట..దీంతో ఇంత ఆనందం ఇప్పుడు బన్నీ వల్లనే సమంతకు వచ్చిందని తెలుస్తుంది.ప్రెసెంట్ ఈమె వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: