చిన్న సినిమాలు లేదా.. సీరియల్స్ లలో నటిస్తున్న వాళ్ళు బిగ్ బాస్ కు వెళ్ళి బాగా పాపులర్ అయ్యారు. లక్షల్లొ కూడా సంపాదించారు.తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నటి హిమజ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హిమజ బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.హిమజ తనకు ఉన్న క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చింది. ఇక బిగ్ బాస్ వచ్చిన తర్వాత ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. బిగ్ బాస్ షోతో ఈ మధ్య మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అయితే బిగ్ బాస్ లో మాత్రం ఈమె బోలెడంత నెగిటివిటి టాక్ ను తెచ్చుకుంది.


సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా హిమజ తన తల్లికి ఖరీదైన బహుమతులను ఇచ్చింది. ఇందుకు సంబంధించిన విషయాన్ని ఆమె సోషల్ మీడియా విరివిగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వీడియోని తన యూట్యూబ్ ఛానల్ రిలీజ్ చేసింది హిమజ. ఆ వీడియోలో మొదటి సారి తన అమ్మకు డైమండ్ నెక్లెస్ తీసుకుంటున్నాను అంటూ తెలిపింది హిమజ. మొదట అమ్మకు సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నాను. కానీ ఆమెకు నచ్చింది తీసుకుంటే బాగుంటుందని తాను కూడా షాప్ కి తీసుకొని వచ్చాను అని తెలిపింది.


అమ్మకు నెక్లెస్ కొన్న హిమజ తర్వాత తనకూ కూడా కొన్ని రకాల హారాలను కొన్నది.వజ్రాల ఆభరణం తో పాటుగా రెండు బంగారు నెక్లెస్ సెట్ ను, బంగారు వడ్డానాణ్ణి సైతం కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది. ఇక ఈ వీడియో పైన తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు హిమజ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, అలాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఇప్పుడు సీరియల్స్ కన్నా ఎక్కువగా సినిమా లలో నటిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: