ఘట్టమనేని ఫ్యామిలీ నుండి సూపర్ స్టార్ కృష్ణ మనవడు గల్లా అశోక్ హీరోగా తొలిపరిచయం అవుతున్నాడు. తెరంగేట్రం తోనే హీరో అనే టైటిల్ తో వస్తున్న అశోక్ టీజర్, ట్రైలర్ తో సినిమాపై ఓ ఇంప్యాక్ట్ క్రియేట్ చేశాడు. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను గల్లా పద్మావతి నిర్మించారు. ఈ సినిమాలో అశోక్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింద్ది. సుధీర్ బాబుతో భలే మంచి రోజు సినిమా చేసిన శ్రీరాం ఆదిత్య ఆ తర్వాత శమంతకమణి, దేవదాస్ సినిమాలు చేశాడు. టాలెంట్ ఉన్నా కుర్రాడికి లక్ మాత్రం కలిసి రావట్లేదని చెప్పాలి.

ఇక ఇదిలాఉంటే గల్లా అశోక్ తో చేసిన ఈ హీరో సినిమా కూడా ముందు ఒక హీరోకి చెబితే అతను కాదన్నాడట. ఆ తర్వాత అశోక్ డెబ్యూ మూవీగా దీన్ని ఫిక్స్ చేశారట. ఇంతకీ హీరో సినిమాని కాదన్న ఆ హీరో ఎవరంటే నితిన్ అని తెలుస్తుంది. హీరో సినిమా కథను ముందు నితిన్ తోనే చేయాలని రాసుకున్నాడట శ్రీరాం ఆదిత్య. అయితే కథ నచ్చలేదో ఏమో కానీ నితిన్ ఈ సినిమా చేయనని చెప్పాడట. హీరో అవుదామనుకుని కలలు కనే ఓ వ్యక్తి.. ఓ మర్డర్ మిస్టరీ లో ఇరుక్కుంటాడు. అతను దాని నుండి ఎలా బయట పడ్డాడు అన్నది హీరో సినిమా కథ.

అయితే కథ ఆల్రెడీ ఫ్లాట్ గా ఉందని అనుకుని బహుశా నితిన్ ఈ సినిమా వద్దని అనుకోవచ్చు. అయితే ట్రైలర్ చూస్తే మాత్రం శ్రీరాం ఆదిత్య సినిమాను ఆసక్తికరంగానే తరెకెక్కించినట్టు అర్ధమవుతుంది. సినిమాలో నిధి గ్లామర్ కూడా ఓ ప్రధాన ఆకర్షణ అయ్యేలా ఉందని అంటున్నారు. మరి నితిన్ కాదన్న కథతో కొత్త హీరోతో శ్రీరాం ఆదిత్య హిట్ కొడతాడా లేదా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: