అంతేకాదు.. అప్పట్లో బన్నీకి యూత్‌లో అంతగా ఫాలోయింగ్ లేదు.. దేశముదురు సినిమా తర్వాత మాస్ ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ పెరిగింది. అయితే దేశముదురు సినిమాను 2007 జనవరి 12న విడుదల అయ్యి.. సంక్రాంతికి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని డివివి దానయ్య తమ యూనివర్సల్ మీడియా పతాకంపై భగవాన్ జె సమర్పణలో తెరకెక్కించారు.
కాగా.. ఈ సినిమాలో హీరోయిన్గా హన్సిక మోత్వానీ తొలిసారిగా తెలుగు తెరకు పరిచయమైంది. ఇక మొదటి సినిమాతోనే సూపర్ హిట్ సాధించి వరుస అవకాశాలను అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రానికి కథ మాటలు స్క్రీన్ ప్లే పూరీ జగన్నాథ్ అందించగా.. చక్రి సంగీతం సమర్పించారు. అలాగే ఈ సినిమా విజయంలో పాటలు కూడా కీలక పాత్ర పోషించాయనే చెప్పాలి మరి. ఇక అప్పట్లో 400 థియేటర్లలో విడుదల అయినా బన్నీ మొదటి చిత్రం ఇదే.
అంతేకాక.. వందకు పైగా థియేటర్లలో శత దినోత్సవం చూసిన ఈ సినిమా హైదరాబాద్ 70 ఎమ్ఎమ్లో నృగ రజతోత్సవం పూర్తి చేసుకుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అల్లు అర్జున్ ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ చూపించి యూత్‌ను ఆకట్టుకున్నారు. ఒక్క విధంగా చెప్పాలంటే.. బన్నీ సినీ కెరీర్లో ఈ సినిమా మైలు రాయిగా నిలిచి పోయిందనే చెప్పుకోవచ్చు.