అక్కినేని హీరోల్లో నాగ చైతన్య ప్రస్తుతం సూపర్ జోష్ లో ఉన్నాడు. వరుస సూపర్ హిట్ సినిమాలతో దూసుకెళ్తున్న చైతు సంక్రాంతికి బంగార్రాజు సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా లో చైతన్య నాగార్జున క్యారక్టర్ లాగా బిహేవ్ చేయడం ఫ్యాన్స్ ని అలరించనుంది. మజిలీ, వెంకీమామ, లవ్ స్టోరీ మూడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న నాగ చైతన్య బంగార్రాజుతో ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత విక్రం కె కుమార్ తో థ్యాంక్ యు సినిమా చేస్తున్నాడు నాగ చైతన్య.

అక్కినేని హీరోలతో మనం సినిమా చేసిన విక్రం కుమార్ చైతుతో థ్యాంక్యు మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కూడా భారీ అంచనాలతో వస్తుంది. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ మూవీ తర్వాత నాగ చైతన్య సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట డైరక్టర్ పరశురాం తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడని తెలుస్తుంది. బంగార్రాజు ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా గురించి రివీల్ చేశారు నాగ చైతన్య. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న పరశురాం తన నెక్స్ట్ సినిమా అక్కినేని హీరోతో చేస్తాడని తెలుస్తుంది.

సర్కారు వారి పాట హిట్ పడితే మాత్రం పరశురాం చైతు సినిమా పై మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. బంగార్రాజు ఎలాగు హిట్ కొట్టేలా ఉన్నాడు కాబట్టి నాగ చైతన్య ఇలానే డబుల్ హ్యాట్రిక్ కూడా కొనసాగించేలా ఉన్నాడు. చైతు పర్ఫెక్ట్ సినిమా ప్లానింగ్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. అక్కినేని హీరో ఫాం చూసి ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతున్నారు. ఇక రాబోయే సినిమాలతో కూడా చైతు ఇదే జోష్ కొనసాగిస్తే మాత్రం లెక్క వేరేలా ఉంటుందని చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: