నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా, అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అఖండ.  ఈ సినిమా పోయిన సంవత్సరం డిసెంబర్ 2 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయ్యింది. అయితే ఈ సినిమా విడుదల అయిన మొదటి షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని ప్రస్తుతం కూడా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. అయితే ఈ సినిమాను మొదట సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం అనుకున్నట్టుగా అనేక వార్తలు బయటకు వచ్చాయి.  అయితే అప్పటికే సంక్రాంతి బరిలో ఆర్ఆర్ఆర్, రాదే శ్యామ్, భీమ్లా నాయక్ లాంటి సినిమాల విడుదల తేదీలను కూడా ప్రకటించడంతో సంక్రాంతికి అఖండ సినిమాను విడుదల చేసినట్లు అయితే అన్ని సినిమా కలెక్షన్ లపై  ప్రభావం పడే అవకాశం ఉన్నందున ఏ స్టార్ హీరో సినిమా విడుదల తేదీకి దగ్గర లేకుండా డిసెంబర్ 2 వ తేదీన ఈ సినిమా విడుదల చేశారు.

 అయితే ఆ సమయంలో  ఏ స్టార్ హీరో సినిమా లేకపోవడం, అలాగే అఖండ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో అఖండ సినిమా అదిరిపోయే కలెక్షన్ లను సాధించింది. ఈ సినిమా బాలకృష్ణ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్ లను సాధించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా దాదాపు 100 కోట్ల వరకు కలెక్షన్ లను సాధించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఒకవేళ అఖండ సినిమాను కనుక డిసెంబర్ 2 వ తేదీన కాకుండా సంక్రాంతికి విడుదల చేసినట్లు అయితే ఈ సినిమా కలెక్షన్ లపై చాలా ప్రభావం పడే అవకాశం ఉండేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అఖండ సినిమాలో పూర్ణ ముఖ్య పాత్రలో నటించగా, శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: