కళ్యాణ్ దేవ్ హీరో గా ఎంట్రీ ఇచ్చి చాలాకాలం అయింది. అయితే ఈ హీరోసినిమా ప్రమోషన్ లో కూడా మెగాస్టార్ ఫ్యామిలీ నుండి ఎవరు ప్రమోషన్లలో పాల్గొనడం లేదు. దీనిపై ఇప్పుడు మెగా కుటుంబంలో ఆయన హీరోగా అవ్వడం ఇష్టం లేదు అన్నట్లుగా ఎక్కువగా వార్తలు సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. కళ్యాణ్ దేవ్ నటించిన విజేత సినిమాకి కూడ ఎవరు ప్రచారానికి రాలేదు. ఇప్పుడు తాజాగా సూపర్ మచ్చి సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతోంది అన్నట్లుగా సమాచారం. సినీ ట్రైలర్ కూడా ఎటువంటి ఆర్భాటాలు లేకుండా లాంచ్ చేయడం జరిగింది.. అందుకు మెగా ఫ్యామిలీలో ఏ హీరో కూడా లాంఛ్ చేయడానికి ముందుకు రాలేదు.. లేదంటే కళ్యాణ్ దేవే వారిని పిలవలేద అనే విషయం తెలియడం లేదు.

మెగా కుటుంబ సభ్యులు కూడా గతంలో ఒక హీరో.. మరొక హీరో సినిమాని ప్రచారం చేయడం గతంలో చూశాము.. ఇక మెగా హీరోలు తన ఫ్యామిలీ నుంచి ఎవరైనా కుర్రహీరోలు ఎంట్రీ ఇస్తున్నారు అంటే.. వారి సినిమాను ఎంతో ప్రమోట్ చేస్తూ ఉంటారు. అయితే కళ్యాణ్ విషయంలో మాత్రం ఇలా ఎందుకు జరగడం లేదని సందేహం వ్యక్తం జరుగుతోంది. సూపర్ మచ్చి సినిమాని కేవలం కళ్యాణ్ దేవే ముందుకు తీసుకు వెళుతున్నాడు.

ఒకవేళ కరోనా సమయం కాబట్టి ఎవరు బయటికి రాలేదు అనుకుంటే.. కానీ వారు అన్ని ఫంక్షన్లకు అటెండ్ అవుతూనే ఉన్నారు. తాజాగా రౌడీ బాయ్స్ మ్యూజికల్ ఈవెంట్ కు రామ్ చరణ్ గెస్ట్ గా వెళ్లడం జరిగింది. అలాంటిది సూపర్ మచ్చి ఈవెంట్ కు హాజరు కార. ఒక వేళ కళ్యాణ్ దేవే సోలో గా రాణించాలేమో అనుకుంటున్నారేమో.. ఒకవేళ మెగా హీరోలకు కళ్యాణ్ దేవ్ హీరోగా ఎదగడం ఇష్టం లేకపోయుండాలి.. ఈ విషయం పై మెగా ఫ్యామిలీనే క్లారిటీ ఇవ్వాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: