కొన్ని కొ్నిసార్లు సినిమాలు, వాటి విడుదల సమయంలో జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించలేం. సరిగ్గా ఇప్పుడు మెగా స్టార్ అల్లుడు కల్యాణ్ దేవ్ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. కల్యాణ్ దేవ్ కొత్త సినిమా సూపర్ మచ్చి.. వాస్తవానికి సంక్రాంతికి విడుదల అనుకున్నారు. సినిమా ప్రారంభంలో దీనిపై బాగా ప్రచారం జరిగింది. అప్పట్లో ఈ సినిమా బాగా హెలెట్ అవుతుందని అనుకున్నారు కూడా. కానీ సరిగ్గా విడుదల సమయానికి ఏదో తేడా కొట్టింది. ప్రస్తుతం సిినిమా విడుదల అవుతున్నా.. ప్రమోషన్ పెద్దగా లేదు.

సంక్రాంతి సినిమా విడుదల, అందులోనూ మెగా ఫ్యామిలీ హీరోకి చెందిన సినిమా.. ఆ హడావిడి ఎలా ఉండాలి. కానీ అవేవీ లేకుండానే సినిమా విడుదల అనేశారు. కనీసం ట్రైలర్ లాంఛింగ్ కి సైతం హీరో రాలేదు. పక్క హీరోల సినిమా ప్రమోషన్లకి వెళ్లే మెగా హీరోలు, కనీసం కల్యాణ్ దేవ్ ని, ఆయన సినిమాని ఎందుకు పట్టించుకోలేదు, మెగా ఫ్యామిలీ హీరో సినిమాపైనే మెగా ఫ్యామిలీలో ఎందుకీ వివక్ష అనేది అర్థం కావడంలేదు. కనీసం దీనిపై ఇంతవరకూ ఎవరూ క్లారిఫికేషన్ కూడా ఇవ్వలేదు.

దర్శక నిర్మాతలతో విభేదాలా..?
పోనీ దర్శక నిర్మాతలతో హీరోకి విభేదాలుంటే.. మెగా ఫ్యామిలీని కాదని ఆ సినిమా విడుదలయ్యే అవకాశాలు లేవు. పోనీ సినిమా దారుణంగా ఉందీ అనుకున్నా.. కెరీర్ స్టార్టింగ్ లో కల్యాణ్ దేవ్ ఇలా సినిమా ప్రమోషన్లను అవాయిడ్ చేసే సాహసాలు చేయకూడదు. ఆయన ఎక్కడ ఉన్నా కూడా సోషల్ మీడియాలో ప్రమోషన్ దంచేయొచ్చు. కానీ అది కూడా జరగలేదు.

ఏదో జరిగింది..?
మొత్తానికి సూపర్ మచ్చి సినిమా విడుదల విషయంలో ఏదో జరుగుతోందనే అనుమానాలు మాత్రం బలపడుతున్నాయి. హీరో లేకుండా.. చిత్ర యూనిట్ ఒక్కటే ఈ సినిమా విడుదల కోసం కష్టపడుతోంది. ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టింది. మరోవైపు థియేటర్ల సమస్యతో చాలా సినిమాలు వెనక్కి వెళ్లినా.. సూపర్ మచ్చి సహా మరికొన్ని సినిమాలు ధైర్యం చేశాయి. ఈ దశలో కనీసం మెగా ఫ్యామిలీ అయినా ఈ సినిమాని ఎందుకు పట్టించుకోవడంలేదో.

మరింత సమాచారం తెలుసుకోండి: