మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాతగా, డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా "ఎవడు" ఈ సినిమా 2014 సంవత్సరంలో జనవరి నెలలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా విడుదలై ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఇందులో కథానాయికగా శ్రుతిహాసన్ నటించింది. ఇక ముఖ్యమైన పాత్రలో అల్లు అర్జున్, కాజల్, అమీ జాక్సన్ నటించారు. రామ్చరణ్ కెరీర్లోనే ఇది ఏడో చిత్రంగా తెరకెక్కిన బడింది. విడుదలైన ఆ ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలిచింది ఈ సినిమా.

ఇక ఈ సినిమాకు పోటీగా మహేష్ బాబు వన్. మూవీ విడుదల అయినప్పటికీ కూడా..ఎవడు సినిమాకి భారీ కలెక్షన్లను రాబట్టింది. అయితే ఈ సినిమా ఎంతటి కలెక్షన్లు రాబట్టింది ఇప్పుడు ఒకసారి చూద్దాం. కలెక్షన్ల విషయానికి వస్తే..

1). నైజాం-12 .65 కోట్ల రూపాయ లు.
2). సీడెడ్-7.95 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-4.70 కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-3.35 కోట్ల రూపాయలు.
5). వెస్ట్-2.70 కోట్ల రూపాయలు.
6). గుంటూరు-3.59 కోట్ల రూపాయ లు.
7). కృష్ణ-2.36 కోట్ల రూపాయలు.
8). నెల్లూరు-2.5 కోట్ల రూపాయ లు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకుని మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే..39.35 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది.
10). రెస్ట్ ఆఫ్ ఇండియా-5.40 కోట్ల రూపాయలు.
11). ఓవర్సీస్-1.75 కోట్ల రూపాయలు.
12). మలయాళం-60-లక్షలు .
13). ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే..47.10 కోట్ల రూపాయలను రాబట్టింది.

ఎవడు సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..44.5 కోట్ల రూపాయలు జరగగా.. ఈ సినిమా ముగిసే సమయానికి..47.10 కోట్ల రూపాయలను రాబట్టింది. దీంతో బయ్యర్లకు ఏకంగా 2.6 కోట్ల రూపాయల లాభాన్ని చవిచూసింది. ఈ సినిమా అప్పటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వల్ల కాస్త ఆలస్యం అయిన కూడా.. విడుదలై మంచి సక్సెస్ను అందుకుంది ఈ చిత్రం.

మరింత సమాచారం తెలుసుకోండి: