మొన్న బోయ‌పాటి - బ‌న్నీ ..
నిన్న బోయ‌పాటి - బాల‌య్య‌..
ఇప్పుడు బోయ‌పాటి - బ‌న్నీ - బాల‌య్య - బీబీబీ

ఇంత‌వ‌ర‌కూ మ‌ల్టీస్టారర్ చిత్రాలు అన్నీ ఓ ఎత్తు.. ఈ ఒక్క సినిమానే మ‌రో ఎత్తు.. ఆయ‌న చరిత్ర రాయ‌డానికి కాదు తిర‌గ రాయ‌డానికి సిద్ధం అవుతున్నాడు.. త‌న‌దైన పంథాలో బ‌న్నీతో తెర పంచుకుని నంద‌మూరి అభిమానుల‌నే కాదు సినిమా ప్రేమికులంద‌రికీ వినోదం పంచ‌నున్నాడు.. బాల‌య్య ఒక్క‌సారి సీన్ లోకి ఎంటరైతే జంక్ష‌న్ల‌న్నీ ఈల‌ల‌తో మోత మోగిపోవాల్సిందే!
బోయ‌పాటి డిసైడ్ అయ్యాడు.. బాల‌య్య తో యుద్ధం చేయించేందుకు.. యుద్ధంలో మ‌రో హీరో కూడా ఉంటే బాగుంటుంది..  బాల‌య్య‌కు బ‌న్నీ తోడు.. ఈ యుద్ధంతో మంచి ఫ‌లితాలు వ‌స్తాయి.. చిత్ర సీమ‌కు నాలుగు కాలాలు గుర్తుండిపోయే విధంగా క‌లెక్ష‌న్లు వ‌స్తాయి.. మాస్ జాత‌ర‌కు మ‌రో సారి సిద్ధం అయిపోవాల‌ని పిలుపు ఇస్తున్నాడు బోయ‌పాటి.. అఖండ విజయంతో అంతులేని ఆనందంతో ఉన్న బోయపాటి.. అదే టెంపోను కంటిన్యూ చేయాల‌ని అనుకుంటున్నాడు.. ఆ క్ర‌మంలో కొత్త సినిమాకు  ఫైన‌ల్ స్క్రిప్ట్ రెడీ చేయ‌నున్నాడు.

అఖండ సినిమాతో అద్భుత విజ‌యం అందుకున్న నంద‌మూరి బాల‌కృష్ణ త‌మ పూర్వ బంధాల‌ను పున‌రుద్ధరించుకుంటున్నారు. ఆ విధంగా బ‌న్నీతో ఓ సినిమా చేయనున్నాడు. ఇప్పుడీ మాట ఇండ‌స్ట్రీలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. మామూలుగా కాదు ఫ్యాన్స్ కు పూన‌కాలే..ఎప్ప‌టి నుంచో ఈ కాంబినేష‌న్ ను సెట్ చేసేందుకు ద‌ర్శ‌క,నిర్మాత‌లు క‌ల‌లు కంటున్నారు. ఆ క‌ల‌ను నిజం చేసేందుకు బోయ‌పాటి ముందుకు వ‌చ్చారు.త్వ‌ర‌లోనే ఈ క‌ల చిత్ర రూపం దాల్చ‌నుంది. ఇందుకోసం ఏర్పాట్లు కూడా మొద‌ల‌య్యాయి అని స‌మాచారం.

బోయ‌పాటి అంటే మాస్
బాల‌య్య అంటే ప‌క్కామాస్
బ‌న్నీ అంటే ఊర మాస్

 
ఇన్ని మాస్ లు ఒక్క చోట చేరితే ఎలా ఉంటుంది చెప్పండి. వ‌చ్చే సంక్రాంతికి సినిమా విడుద‌ల చేసే బాక్సాఫీసులు షేక్ అవ్వాల్సిందే! అంత‌టి స్థాయి క‌థ‌లో బాల‌య్యను, బ‌న్నీని చూపించేందుకు ప్రిపేర్ అవుతున్నాడు బోయ‌పాటి.త‌న‌దైన స్టైల్ లో కథ క‌థ‌నం ఉంటూనే అటు బాల‌య్య అభిమానులను, ఇటు బ‌న్నీ అభిమానుల‌నూ అల‌రిస్తాన‌ని చెబుతున్నాడు బోయ‌పాటి. ఇండ‌స్ట్రీలో ఇది జ‌ర‌గ‌దు అది జ‌రుగుతుంది అనేందుకు లేదు..ఎప్పుడు ఏదైనా జ‌ర‌గ‌వ‌చ్చు అని కూడా అంటున్నాడు బోయ‌పాటి.


మరింత సమాచారం తెలుసుకోండి: