మిల్కీ బ్యూటీ తమన్నా 2005లో వచ్చిన మంచు మనోజ్ శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అప్పటినుండి 17 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. శ్రీ తర్వాత కెరియర్ మొదట్లోనే రెండేళ్ల పాట్ గ్యాప్ తీసుకున్న తమన్నా శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ తో మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చింది. ఇక ఆ సినిమా నుండి అమ్మడు తిరిగి చూసుకోలేదని చెప్పొచ్చు. తమన్నా సినిమాలో ఉంది అంటే గ్లామర్ కి కొదవ లేదని అన్నట్టే.

ఇక కేవలం హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ కు తమన్నా స్పెషల్ ఎట్రాక్షన్ తీసుకొచింద్ది. హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ చేయడం తమన్నాతోనే మొదలైందని చెప్పొచ్చు. ఎలాగైనా సరే ఆడియెన్స్ ని అలరించడమే తన ఉద్దేశం గా పెట్టుకున్న తమన్నా ఐటం సాంగ్స్ కు అడ్డు చెప్పట్లేదు. టాలీవుడ్ కోసం తమన్నా ఎలాంటి రిస్క్ అయినా చేసుకుంటుంది. తనకి ఇంతటి క్రేజ్ తెచ్చిన తెలుగు చలచిత్ర పరిశ్రమ అంటే అమ్మడికి ఓ రేంజ్ లో అభిమానం.

ఓ పక్క హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరోపక్క అమ్మడు స్పెషల్ సాంగ్స్ కు సైన్ చేస్తుంది. లేటెస్ట్ గా వరుణ్ తేజ్ గని సినిమాలో తమన్నా ఐటం సాంగ్ చేస్తుందని తెలుస్తుంది. ఓ పక్క ఎఫ్3 సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ లతో కలిసి నటిస్తున్న తమన్నా అదే వరుణ్ తేజ్ చేస్తున్న గని సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడం విశేషం. తనకు వచిన ఏ ఛాన్స్ అయినా సరే కాదనకుండా చేస్తూ కెరియర్ లో దూసుకెళ్తుంది తమన్నా. ఇక లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి భోళా శనక్ర్ సినిమాలో కూడా ఆమె ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. గని సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్ సినిమాకే హైలెత్ గా ఉంటుందని అంటున్నారు మేకర్స్.


మరింత సమాచారం తెలుసుకోండి: