హీరోగా రవితేజ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించాడు.. అలాంటి వాటిలో కృష్ణ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాకి అగ్ర నిర్మాత అయినటువంటి డి.వి.వి.దానయ్య నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ సినిమా రవితేజ వివి.వినాయక్ కాంబినేషన్లో రూపొందించబడింది. ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని, బాగా ఎంటర్టైన్మెంట్ చేసిందని చెప్పవచ్చు. ఇందులో హీరోయిన్ గా త్రిష నటించింది.. ఇక ఈ సినిమా 2008వ సంవత్సరంలో జనవరి నెలలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకు పోటీగా బాలకృష్ణ నటించిన ఒక్కమగాడు సినిమా కూడా విడుదలైంది.. కానీ ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర డిజాస్టర్ గా మిగిలింది. ఇక కృష్ణ సినిమాలో బ్రహ్మానందం, జై ప్రకాష్ రెడ్డికామెడీ తో బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఇప్పటికీ ఈ సినిమా విడుదలై 14 సంవత్సరాలు పూర్తి కావస్తోంది.. అయితే ఈ సినిమా ఇప్పుడు ఎంతటి కలెక్షన్లు రాబట్టిందో ఒకసారి చూద్దాం. కలెక్షన్ల విషయానికి వస్తే..

1). నైజాం-4.69 కోట్ల రూపాయలు.
2). సీడెడ్-1.97 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-2.30 కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-1.12 కోట్ల రూపాయలు.
5). వెస్ట్-1.4 కోట్ల రూపాయలు.
6). గుంటూరు-1.93 కోట్ల రూపాయలు.
7). కృష్ణ-1.29 కోట్ల రూపాయలు.
8). నెల్లూరు-1.29కోట్ల రూపాయలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకుని మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే..15.63 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది.
10). రెస్ట్ ఆఫ్ ఇండియా-2.45కోట్ల రూపాయలు.
11). ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే..18.8 కోట్ల రూపాయలను రాబట్టింది.

రవితేజ కృష్ణ మూవీ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే..12 కోట్ల రూపాయలు జరగ్గా ఈ సినిమా ముగిసే సమయానికి..18.8 కోట్ల రూపాయలను రాబట్టింది. మొత్తానికి ఈ సినిమా ద్వారా బయ్యర్లకు 6.8 కోట్ల రూపాయల లాభాన్ని తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు. రవితేజ సినీ కెరియర్ లోనే మరొక బ్లాక్బస్టర్ మూవీగా నిలిచింది కృష్ణ. అయితే  డైరెక్టర్ వి.వి.వినాయక్, రవితేజ కాంబినేషన్ లో మరొక సినిమా రావాలని రవితేజ అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: