పుష్ప సినిమా గురించి తాను 300 కోట్లు తెస్తుందని అంటే తన కామెంట్లకు నవ్వుకున్నారు కానీ ఇప్పుడు అదే నిజమైందని అన్నారు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. వైసీపీ ఎమ్మెల్యే సినిమా వాళ్లని బలిసినోళ్లు అని అనడంపై ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి వైసీ నాయకులను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. సినిమా వాళ్లు పడుతున్న కష్టాన్ని గురించి చెబుతూ మీ ఎమ్మెల్యేలు ఎంత సంపాదిస్తున్నారో చర్చ పెడదామా అని అన్నారు.

ఇక ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యాం సినిమాలు పాన్ ఇండియా రిలీజ్ సినిమాలు కాబట్టి కేవలం ఏపీలో టికెట్ల ఇష్యూ వల్ల ఆగిపోలేదని. ఢిల్లీ, మహరాష్ట్ర, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల్లో థియేటర్లు సరిగా అందుబాటులో లేకపోవడం వల్లే సినిమా వాయిదా పడిందని అనుకుంటున్నానని అన్నారు తమ్మారెడ్డి. అంతేకాదు పుష్ప సినిమా 300 కోట్లు తెచ్చిందని.. నార్త్ ఆడియెన్స్, తమిళ ఆడియెన్స్ కూడా ఈ సినిమాని ఆదరించారని చెప్పారు/

సినిమాలో దమ్ము ఉంటే అది ఎక్కడైనా ఆడుతుందని. పుష్ప సినిమా 300 కోట్లు చేస్తుందని తాను వీడియో తీసి పెడితే అందరు అప్పుడు నవ్వుకున్నారని ఇప్పుడు అదే నిజమైందని అన్నారు తమ్మా రెడ్డి భరధ్వాజ్. అల్లు అర్జున్ కి తెలుగు, మళయాళ భాషల్లో మార్కెట్ ఉంది. అయితే పుష్ప సినిమాతో హిందీ, తమిళంలో కూడా మార్కెట్ తెచ్చుకున్నాడని అన్నారు. పుష్ప సినిమాతో బాలీవుడ్ లో అల్లు అర్జున్ 100 కోట్ల హీరో అయ్యాడని ఇది మంచి తరుణమని అన్నారు. ఇండస్ట్రీ సమస్యల గురించి ఎప్పుడూ తన గొంతు వినిపించే తమ్మా రెడ్డి భరధ్వాజ్ ఎవరు పడితే వాళ్లు సినీ పరిశ్రమ వ్యక్తులను కించపరచేలా మాట్లాడటం పై తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. మాకు ధైర్యం ఉంది.. మాకు దమ్ము ఉంద్ది.. మేము మాట్లాడగలమని అన్నారు తమ్మా రెడ్డి. సమస్య పరిష్కారం దిశగా వెళ్లాలని రెచగొట్టే వ్యాఖ్యలు సరికాదని ఆయన అన్నారు. మరి తమ్మారెడ్డి కామెంట్స్ కు ఏపీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: