పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ ఆయన అభిమానులను ఎంతగానో ఆకరిస్తూ ఉండగా మరొక వైపు ఆయన చేసే చర్యలు ఆయన సినిమాల నిర్మాతలకు ఒకింత ఆగ్రహాన్ని తెప్పిస్తుంది అని చెప్పవచ్చు. సినిమాల నుంచి రాజకీయాలకు వెళ్లి అక్కడ సక్సెస్ అవ్వాలని  పవన్ కళ్యాణ్ ఆలోచన. అందుకే 2014 వ సంవత్సరం నుంచి ఆయన రాజకీయాలలో నిలదొక్కుకునే విధంగా ఎన్నో ప్రణాళికలు రచించాడు

ఆ విధంగా గత సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ ద్వారా పోటీ చేసి కేవలం ఒకే ఒక్క సీటు తో బయట పడ్డాడు పవన్. అయినా కూడా కుంగిపోకుండా ఆయన రాజకీయాల్లో కొనసాగుతూ ప్రజల నమ్మకాన్ని తెచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికలకు సమయం ఉండటంతో ఈ లోపు సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించాలని వరుస సినిమాలు చేస్తున్నాడు.  అయితే ఇప్పుడు కరోనా ప్రభావం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో తాను చేస్తున్న నాలుగు సినిమాల షూటింగ్ లకు సంబంధించి పనులను ఆపేసి ప్రజలకు ఉపయోగపడాలని ఆయన నిర్ణయం తీసుకున్నారట.

దాంతో అనుకున్న తేదీలలో షూటింగ్ జరగబోయే సరికి సదరు సినిమా నిర్మాతలకు కోపం వస్తోందట. ఈ హఠాత్ పరిణామంతో ఆశ్చర్యపోతున్న నిర్మాతలు తమ సినిమాల పరిస్థితి ఏంటి అని సినీ పెద్దల వద్దకు తరలిపోతున్నారట. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దీని గురించి పునరాలోచన చేస్తాడా అనేది చూడాలి. సాగర్ చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమా పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ చిత్రాన్ని ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అలాగే క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగవద్గీత అనే సినిమా చేస్తున్నాడు. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు.. అంతేకాదు మరింతమంది తో సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: