బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇప్పుడు సౌత్ సినిమాలపై దృష్టి పెట్టినట్లు గా ఇక్కడి సినిమాలను అక్కడ హీరోలు చేస్తున్న వరుస ను బట్టి చెప్పవచ్చు. మొదటి నుంచి సౌత్ సినిమాలపై బాలీవుడ్ ఓ కన్నేసి ఉంచుతుంది. మంచి సినిమా వచ్చిందంటే చాలు వెంటనే రీమేక్ చేసుకుని అక్కడ నేటివిటీకి తగ్గట్లు గా సినిమా చేసి సదరు సినిమా హిట్ ను తన ఖాతాలో వేసుకుంటుంది. ఆ విధంగా సౌత్ సినిమా పరిశ్రమలోని చాలా సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ లు గా చేసి సూపర్ హిట్ కొట్టి భారీగా వసూలు సాధించారు.

అయితే సౌత్ సినిమాలకు ఉన్న డిమాండ్ ను గ్రహించి సౌత్ సినిమా వారు పాన్ ఇండియా సినిమాలు అంటూ అన్ని భాషలలోనూ తమ సినిమా విడుదల అయ్యే విధంగా చూసుకోవడం బాలీవుడ్ కు చేదు వార్తే అయింది అని చెప్పవచ్చు. బాహుబలి సినిమా తో ఈ రకమైన సినిమాలు అన్ని భాషల లో ప్రేక్షకుల ముందుకు రావడం మొదలవడంతో ఎక్కువ సౌత్ సినిమాలేవి బాలీవుడ్లో రావడం లేదు. దాంతో సొంత కథలపైనే వారు సినిమాలు చేయడం పై ఆధారపడి ఉన్నారు బాలీవుడ్ సినీ జనాలు.

తాజాగా మరికొన్ని సౌత్ సినిమాలను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాని సినిమాలపై బాలీవుడ్ ఇప్పుడు ఫోకస్ పెట్టింది. ఇప్పటికే తమిళంలో సూపర్ హిట్ అయిన విక్రమ్ వేద చిత్రాన్ని బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సైఫ్ అలీ ఖాన్ హీరోలుగా చేస్తుండగా ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, బ్రో డాడీ వంటి మలయాళం సినిమాలపై కూడా బాలీవుడ్ కన్నేసింది. తొందరలోనే ఈ సినిమాలు షూటింగ్ లు చేయనున్నాయి. అంతేకాదు తెలుగులో తమిళంలో వచ్చే నాన్ పాన్ ఇండియా సినిమాల రీమేక్ హక్కులను వెంటనే తీసుకుని అక్కడ తెరకెక్కించి బాలీవుడ్ లో క్యాష్ చేసుకోవాలనేది బాలీవుడ్ నిర్మాతల ఆలోచన. ఈ నేపథ్యంలో ఈ విధమైన ఆలోచన వారికి ఏవిధంగా ఉపయోగపడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: