రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. దేశంలోనే ఒక ట్రెండ్ ను సృష్టించిన సినిమాగా బాహుబలి సినిమా ను అభివర్ణించవచ్చు. అప్పటి దాకా పాన్ ఇండియా సినిమాల గురించి ఏ ఒక్కరికి కూడా అవగాహన లేదు. దేశంలోనే తొలిసారిగా అంతటి స్థాయిలో విడుదల అయిన సినిమా ఒక్క బాహుబలి సినిమానే కావడం విశేషం. వందల కోట్ల బడ్జెట్ పెట్టి నిర్మించిన సినిమా కూడా బాహుబలి సినిమానే.

అంతకు ముందు దాన్ని దరిదాపుల్లో కూడా ఏ చిత్రం అంతటి బడ్జెట్ తో నిర్మించబడలేదు. దాంతో ఎన్నో విశేషాలను పొదిగిన బాహుబలి సినిమా భారీ రికార్డులను ఆదుకొని దేశంలోనే గొప్ప సినిమాగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో దానిని మించిన సినిమాసినిమా పరిశ్రమలోనూ ఇకపై రాదు రాబొడు అని అందరూ అనుకున్నారు. కానీ సినిమా అంటేనే వైవిధ్యాలతో పోటీ తత్వంతో ఉన్నది కాబట్టి మన సినిమా నిర్వాహకులు ఒక సినిమాను మించి మరో సిని మా చేయాలని భావంతో అంకితభావంతో కృషి చేస్తూ ఉంటారు.

ఆ క్రమంలోనే బాహుబలి సినిమాను మించిన క్రేజ్ ఇప్పుడు అల్లుబర్జున్ హీరో గా నటించిన పుష్ప సినిమాకి ఇప్పుడు రావడం అందరినీ ఆనంద పరుస్తోంది. అందులోనూ తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఆ సినిమా కి ఇంతటి ఖ్యాతి రావడం ఇప్పుడు అందరికీ ఎంతో గర్వకారణం. పుష్ప సినిమా బాహుబలి సినిమా విషయంలో పోటీ లేనిది. క్వాలిటీ విషయంలో, బడ్జెట్ విషయం లో చాలా వ్యత్యాసం ఉంది కానీ బాహుబలి సినిమాకు సమానం గా క్రేజ్ రావడం మాత్రం అందరినీ ఎంతో ఆశ్చర్యపరుస్తుంది అని చెప్పవచ్చు. ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా బాహుబలి కి పెట్టిన ఖర్చులో పావులా ఖర్చు కూడా పెట్టకపోయినా కూడా అదే స్థాయిలో క్రేజ్ రావడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: