ఒక హీరో తిరస్కరించిన ఒక కథ మరొక హీరో చేతిలో పడినప్పుడు ఆమూవీ సూపర్ హిట్ అయిన సందర్భాలు ఇండస్ట్రీలో అనేకం ఉన్నాయి. అయితే ఇప్పుడు నితిన్ తిరస్కరణ గల్లా అశోక్ కు అదృష్టంగా మారుతుందా అంటూ ఇప్పుడు ఇండస్ట్రీలోని వర్గాలు అనేక అంచనాలు వేస్తున్నాయి. మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా నటించిన హీరో మూవీ నాగార్జున చైతన్యల ‘బంగార్రాజు’ తో పోటీ పడుతున్నప్పటికీ తమ మూవీని భారీగా ప్రమోట్ చేసుకునే వ్యూహాలలో అశోక్ గల్లా ఉన్నాడు.


శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈమూవీలో పేరున్న నటీనటులు అంతా నటిస్తున్నారు. సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీలోని ప్రతి సన్నివేశాన్ని చాల క్వాలిటీతో చిత్రీకరించారని అంటున్నారు. ఎప్పటికైనా  సినిమా హీరో అవ్వాలని కలలు కనే ఒక యువకుడు సడన్ గా ఒక  మర్డర్ మిస్టరీలో చిక్కుకుని తెలివిగా బయటపడే కథ ఈ హీరో అని అంటున్నారు.


ఈమూవీలో రెండు మూడు కామెడీ ఎపిసోడ్స్ చూసినవారు తెగ నవ్వుకుంటారని అంటున్నారు. ముఖ్యంగా సినిమాలకు సంబంధించిన ఒక ట్రాక్ ను పెట్టారట. అది చూస్తున్నంతసేపు ఆడియన్స్ నవ్వుతూనే ఉంటారని  మాటలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే గల్లా అశోక్ కొత్త హీరో కావడంతో అతడికి పెద్దగా అభిమానులు ఉండరు.


కనుక అతడి మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షోకు జనం విపరీతంగా రావాలి అన్న ఉద్దేశ్యంతో వ్యూహాత్మకంగా ఈమూవీ దర్శక నిర్మాతలు తెలుగు రాష్ట్రాలలో ఉన్న మహేష్ అభిమాన సంఘాలతో చ్ర్చాలు జరుపుతూ అశోక్ వైపు మహేష్ అభిమానులు ఆశక్తి కనపరిచే విధంగా ఈమూవీ నిర్మాతలు మహేష్ వీరాభిమానుల కోసం ఒక సరికొత్త వ్యూహాన్ని రచిస్తున్నట్లు టాక్. అనుకున్న విధంగా మహేష్ అభిమానులు అశోక్ ను అభిమానిస్తే ఈమూవీకి ఓపెనింగ్ కలక్షన్స్ బెడద ఉండకపోవచ్చు అంటున్నారు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన మూవీలోని ఒక పాటను ప్రత్యేకంగా గల్లా అశోక్ రీమిక్స్ చేయించుకోవడం ద్వారా తన తాత పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: