మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమాలో నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా నటించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా అనేక వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కి తమ్ముడు పాత్రలో రవితేజ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది వరకే మెగాస్టార్ చిరంజీవి కి తమ్ముడిగా మాస్ మహారాజా రవితేజ అన్నయ్య సినిమాలో నటించాడు. ఈ సినిమా 2000 వ సంవత్సరంలో విడుదలై అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

  అయితే మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత వీరిద్దరూ అన్నదమ్ముల్లా కనిపించబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ వార్త పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇది ఇలా ఉంటే చిరంజీవిసినిమా తో పాటు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 4 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే ప్రకటించింది. అలాగే మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో కూడా చిరంజీవి హీరోగా నటిస్తున్నాడు. దీనితో పాటు తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమాలో కూడా చిరంజీవి హీరోగా నటిస్తున్నాడు.  ఈ సినిమాలతో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా చిరంజీవి ఒక సినిమాలో నటించడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: