తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కొత్తగా పరిచయం అవ్వడానికి సిద్ధంగా ఉన్న హీరోల్లో అశోక్ గల్లా ఒకరినే చెప్పుకోవచ్చు. ఆయనకు ఒక వైపున పొలిటికల్ సపోర్ట్.. మరోవైపు ఘట్టమనేని సూపర్ స్టార్ ఇమేజ్.. ఈ రెండింటిని అడ్వాంటేజ్ గా చేసుకుని బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా ఇప్పుడు తన ఎంట్రీకి సిద్ధమయ్యారు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల అంశాలను.. ఈ సినిమా ప్రమోషన్‌లో వెల్లడిస్తున్నారు. ఈ సందర్బంగా ఓ ఇంటర్వ్యూలలో అశోక్ గల్లా తన ఫ్యామిలీకి సంబంధించిన పర్సనల్ విషయాలను కూడా ఓపెన్‌గానే చెప్పుకొచ్చాడు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అశోక్ తన మేన మామ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూర్చొని బీర్ కూడా తగినట్లు తెలిపారు. అంతేకాదు.. అతను 18 ఏళ్లలోకి వచ్చిన తరువాత ఒక సారి ఇంట్లోనే మహేష్ పక్కన ఉండగానే బీర్ తీసుకొని తాగానని అప్పుడు మహేష్ చాలా డిఫరెంట్‌గా చాలా సేపు అదే లుక్‌తో చూసినట్లు పేర్కొన్నారు.

ఇక మహేష్ బాబు బీర్ తాగుతావా అంటూ అడగడంతో నేను సైలెంట్‌గా ఉండి పోయాను అని అశోక్ చెప్పుకొచ్చాడు. అయితే  ఒక విధంగా అశోక్ తన మామయ్యతో చాలా క్లోజ్‌గా ఉంటాడని ఇక్కడే అర్ధమైపోతుంది. అంతేకాక.. మహేష్ బాబు ఇంట్లో చాలా కూల్‌గా అల్లరిగా ఉంటారని ఆయన పిల్లలతో ఉన్నా కూడా వాళ్ళతో ఈజీగా కలిసిపోతారని అశోక్ చెప్పుకొచ్చాడు.

అశోక్‌కి తెలిసినంత వరకు మహేష్ బాబు లాంటి వ్యక్తిని తన జీవితంలో చూడలేదన్నారు. ఆయనతో కనెక్ట్ అయితే ఎదుటి వారు కూడా చాలా హ్యాపీగా ఉండేలా చేస్తారని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. మహేష్ బాబు ఫ్యామిలీకి సంబంధించిన ప్రతీ విషయంలో చాలా బాధ్యతగా ఉంటారని, ఫ్యామిలీ మెంబర్స్‌తో ఇట్టే కలిసిపోయి.. చుట్టూ ఉండేవాళ్ళు కూడా ఎనర్జిటిక్‌గా ఉండేలా సరదాగా ఉంటారని అశోక్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: