ఒక హీరోకు అనుకున్న టైటిల్‌తో మ‌రో హీరో సినిమా చేయ‌డం స‌ర్వ సాధార‌ణం. అయితే ఇలాంటి ప‌రిస్థితే మ‌హేష్ బాబు, ప్ర‌భాస్‌ల‌కు కూడా వ‌చ్చింది. ఓసారి మ‌హేష్ బాబు కోసం రిజిస్ట‌ర్ అయిన టైటిల్‌తో.. ప్ర‌భాస్ సినిమా చేసి సూప‌ర్ హిట్ అందుకున్నాడు. మ‌రి ఆ సినిమా ఏంటో..? అస‌లు ఏం జ‌రిగిందో..? తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే.

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా కొండపల్లి దశరథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `మిస్టర్ పర్‌ఫెక్ట్`. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, తాప్సీ హీరోయిన్లుగా న‌టించారు. ప్రకాష్ రాజ్, నాజర్, మాగంటి మురళీ మోహన్, సాయాజీ షిండే కీల‌క పాత్ర‌ల‌ను పోషించిన ఈ చిత్రం 21 ఏప్రిల్ 2011న విడుద‌లై మంచి విజ‌యం సాధించింది.

తనకు నచ్చిందే చేస్తే తనే పర్‌ఫెక్ట్‌. కాస్త కాంప్రమైజ్‌ అయి నలుగురికి నచ్చేట్లు చేయగలిగితే అతనే మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌.. అనే కాన్సెప్ట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని మంచి క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. అయితే నిజానికి ఈ సినిమా టైటిల్‌ను మ‌హేష్ బాబు సినిమా కోసం రిజిస్ట‌ర్ చేయించార‌ట‌.

అస‌లేం జ‌రిగిందంటే.. కిక్ సినిమాతో హిట్ అందుకున్న సురేంద‌ర్ రెడ్డి ఆపై మహేష్ కోసం మాఫియా నేప‌థ్యంలో ఓ క‌థ‌ను రెడీ చేసి వినిపించ‌గా అది ఆయ‌న‌కు బాగా న‌చ్చేసింద‌ట‌. వీరి కాంబో చిత్రాన్ని ఆర్ఆర్ మూవీ మేక‌ర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు ముందుకు వ‌చ్చి.. మ‌హేష్‌కు రెండు కోట్లు అడ్వాన్స్ ఇచ్చార‌ట‌. అలాగే ఈ సినిమాకు `మిస్టర్ ప‌ర్ఫెక్ట్` అనే టైటిల్‌ను ఖ‌రారు చేయించార‌ట‌. కానీ, అనుకోని కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా ఆగిపోయింది. ఇక కొద్ది రోజుల త‌ర్వాత ప్ర‌భాస్ సినిమా కోసం ద‌ర్శ‌కుడు దశరథ్ ఆర్ఆర్ మూవీ మేక‌ర్స్ అధినేత వెంక‌ట్ కు ఫోన్ చేసి `మిస్ట‌ర్ ప‌ర‌ఫెక్ట్‌` టైటిల్‌ను కోర‌గా.. ఆయ‌న డార్లింగ్ కోసం దానిని ఇచ్చేశారు. అలా మ‌హేష్ బాబు టైటిల్‌తో ప్ర‌భాస్ సినిమా చేసి హిట్ అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: