ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ వున్న హీరోయిన్గా కొనసాగుతుంది నిధి అగర్వాల్. అప్పటి వరకు ఎన్నో సినిమాల్లో చేసినా రాని క్రేజ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తో ఒక్కసారిగా వచ్చేసింది. ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాతో తన అందాలతో తెలుగు ప్రేక్షకుల మతి పోగొట్టింది ఈ ముద్దుగుమ్మ. తన కోర చూపుల తో ఎంతో మంది గుండెల్లో గుబులు పుట్టించింది. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా సూపర్ హిట్ సాధించడంతో ఈ అమ్మడికి ఒక్కసారిగా స్టార్ డమ్ వచ్చేసింది. దీంతో దర్శకనిర్మాతలు అందరి చూపు ఈ అమ్మడి పై పడిపోయింది అని చెప్పాలి.


 దీంతో వరుస సినిమాలతో బిజీ బిజీగా మారిపోయింది ఇష్మార్ట్ బ్యూటీ. కేవలం తెలుగులో మాత్రమే కాదు అటు తమిళం, కన్నడ భాషల్లో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ ప్రస్తుతం దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఇక్కడ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ హాట్ హాట్ ఫోటో షూట్ లు చేస్తూ అభిమానులను అలరిస్తుంది. ఇక దాదాపు ఎన్నో రోజుల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమై కేవలం తమిళంలోనే సినిమాలు చేస్తూ ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇక ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గల్లా అశోక్ హీరోగా పరిచయమవుతున్న 'హీరో' అనే సినిమాలో నిధి అగర్వాల్ నటిస్తోంది.


 హీరో సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రమోషన్ శరవేగంగా నిర్వహిస్తున్నారు.. ఇక ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి అగర్వాల్ హీరో సినిమాలో డాక్టర్ పాత్రలో కనిపించబోతున్నా అంటూ చెప్పుకొచ్చింది. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిసి నటించే అవకాశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అంటూ నిధి అగర్వాల్ మనసులో మాట బయట పెట్టేసింది. మరి ఈ హాట్ బ్యూటీ కోరుకున్నట్లుగా ఈ ముగ్గురు స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశం వస్తుందా లేదా అన్నది మాత్రం ఫ్యూచర్ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో  ఈ అమ్మడు నడుస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: