జాక్వలిన్ ఫెర్నాండెజ్.. ఈ పేరు చెబితే చాలు బాలీవుడ్ ప్రేక్షకులు అందరూ కూడా పగటికలలోకి వెళ్ళి పోతూ ఉంటారు. ఎందుకంటే ఈ అమ్మడు అందాల ఆరబోతతో రచ్చ చేస్తూ ఉంటుంది. శ్రీలంకకు చెందిన ఈ ముద్దుగుమ్మ మోడల్ గా కెరీర్ ప్రారంభించి ఇక ఇప్పుడు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది. అందాల ఆరబోతలో ఎలాంటి లిమిటేషన్స్ పెట్టుకోని ఈ ముద్దుగుమ్మ ఒక వైపు సినిమాలు మరో వైపు సోషల్ మీడియాలో కూడా తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ అందరికీ పిచ్చెక్కిస్తుంది. అందుకే ఈ అమ్మడికి యూత్ లో తెగ ఫాలోయింగ్ పెరిగిపోయింది.


 2006 సంవత్సరంలో మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇక ఇప్పుడు బాలీవుడ్లో ఎంతో బిజీ బిజీ హీరోయిన్గా మారిపోయింది. 2009 లో జాస్మిన్ అనే సినిమాతో అలాడీన్ తో జోడీ కట్టింది జాక్వలిన్ ఫెర్నాండెజ్. ఇక ఆ తర్వాత 2011లో మర్డర్ 2 అనే సినిమాతో కమర్షియల్ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. అటు వెంటనే 2012లో రన్ 2 అనే సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది.


 అయితే ఈ అమ్మడు సినిమాల ద్వారానే కాదు ఎఫైర్ల ద్వారా కూడా ఎంతగానో ఫేమస్ అయింది అని చెప్పాలి.. సినిమాల్లోకి రాక ముందు నుంచే ఎంతో మంది తో డేటింగ్ చేస్తూ వస్తుంది ఈ ముద్దుగుమ్మ. 2008లో బహరైని ప్రిన్స్ హాసన్ బిన్ రషీద్ తో డేటింగ్ కొనసాగించింది జాక్వలిన్. 2011లో ఇక ఈ రిలేషన్ షిప్ కి గుడ్ బై చెప్పేసింది. ఇక ఆ తర్వాత కాస్త గ్యాప్ లేకుండా బాలీవుడ్ డైరెక్టర్ సాజిద్ ఖాన్తో డేటింగ్ కు సిద్ధమైంది. ఇక వీరిద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరగడం అప్పట్లో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత ఏం జరిగిందో 2013లో సాజిద్ ఖాన్ తో రిలేషన్ షిప్ కి కూడా బ్రేక్ అప్ చెప్పేసింది.. ఇప్పుడు సుకేష్ చంద్ర శేఖర్ తో జాక్వలిన్ ఫెర్నాండెజ్ డేటింగ్ లో ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ రిలేషన్ షిప్  ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: