మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఉప్పెన సినిమాలో పరిచయమయ్యాడు. అయితే ఇదే సినిమాతో మెగా హీరో తో జోడి కట్టి టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ఇక మొదటి సినిమానే మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడికి ఎంతో క్రేజ్ వచ్చి పడింది. ఇక తొలి చిత్రంలోనే తన అందం అభినయంతో కుర్రకారు మతి పోగొట్టింది ఈ సొట్ట బుగ్గల సుందరి. ఇక దర్శక నిర్మాతలు అందరిని కూడా కోర చూపుల తో ఆకర్షించటంతో వరుస అవకాశాలు వచ్చి ఈ అమ్మడి ముంగిట వాలిపోయాయి. ఇక ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ.


 ఇటీవలే నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన శ్యామ్ సింగరాయి  సినిమాలో హీరోయిన్ గా నటించి మరో సక్సెస్ను తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదండోయ్ ఈ సినిమాలో రెండు మూడు సార్లు నాని కి లిప్ లాక్ ఇచ్చి నాకు ఎలాంటి లిమిటేషన్స్ లేవు అంటూ చెప్పకనే చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు నాగచైతన్యతో కలిసి బంగార్రాజు లో జోడీ కట్టిన ఈ ముద్దుగుమ్మ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ను అలరించేందుకు సిద్ధమైంది. ఇక రామ్ పోతినేని లింగుస్వామి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తుంది కృతి శెట్టి. ఇలా వరుస తిరుమల తో బిజీ బిజీగా ఉన్న కృతి శెట్టి కి ఇక ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి మరో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.


 ఇప్పటికే మెగా హీరో వైష్ణవ్ తేజ్  తో నటించిన కృతి శెట్టి ఇప్పుడు మెగా కాంపౌండ్ లో ఎలాంటి ఆఫర్ అందుకుంది అని అనుకుంటున్నారా.. ప్రస్తుతం చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత సేనాపతి చిత్రంతో నిర్మాతగా మారి మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సుస్మిత ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కృతి శెట్టి అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. దీనికి ఉయ్యాల జంపాల సినిమా ఫేమ్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా సినిమాకు కృతి శెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. దీనికి సంబంధించి మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: