సాధారణంగా సెలబ్రిటీలు ప్రేమ వివాహం చేసుకుంటే ఇక ఆ జంట ప్రేక్షకులందరినీ ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే నిజజీవితంలో భార్యాభర్తల్లా ఉన్న సినీ సెలబ్రిటీలు సినిమాల్లో కూడా కలిసి నటిస్తే ఇక ప్రేక్షకుల ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పాలి. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో మోస్ట్ లవ్ కపుల్స్ గా ఉన్నా రణవీర్,దీపికా పదుకొనే 83 సినిమాలో భార్యాభర్తలుగా నటించారు. దీంతో ఈ రియల్ లైఫ్ భార్య భర్తలను రీల్ లైఫ్లో కూడా భార్య భర్తలుగా చూసి అభిమానులు మురిసిపోయారు. ఇక ఇప్పుడు మరో జంట ఇలా సినిమాల్లో భార్యాభర్తలుగా నటించేందుకు సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. ఇటీవలే పెళ్లితో ఒక్కటయ్యారు బాలీవుడ్ స్టార్లు విక్కీ కౌశల్, కత్రినాకైఫ్. డిసెంబర్ 9 2021వ తేదీన వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక పెళ్లి తర్వాత వీరిద్దరూ సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోయారు. ఇకపోతే ఇటీవల పెళ్లితో ఒకటైన ఈ జంట ఇక ఇప్పుడు సినిమాల్లో కూడా జంటగా నటించటానికి సిద్ధమవుతున్నట్లు బాలీవుడ్లో ఒక టాక్ చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే వీరిద్దరికి కథ వినిపించగా ఇక సినిమాలో జంటగా నటించటానికి ఒప్పుకున్నారు అంటూ ఒక పుకారు షికారు చేస్తోంది. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో 'జీ లే జర' అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్  కీలక పాత్రలో నటిస్తూ ఉండటం గమనార్హం. అయితే ఈ సినిమాలో కత్రినా కైఫ్ కు జోడిగా రియల్ లైఫ్ భర్త విక్కీ కౌశల్ నటిస్తే బాగుంటుందని అటు దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఇక అనుకున్నదే తడవుగా  ఈ పాత్ర విషయంపై చిత్ర బృందం  విక్కీ కౌశల్ ను సంప్రదించగా ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే పెళ్లి తర్వాత విక్కీ కౌశల్ కత్రినాకైఫ్ కలిసి నటించిన మొదటి సినిమా ఇదే అవుతుంది అన్నది తెలుస్తుంది. ఇకపోతే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. అయితే ఈ పుకారు నిజం కావాలని అటు అభిమానులు అందరూ  కోరుకుంటూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: