టాలీవుడ్ కింగ్ నాగార్జున అంటే తెలియ‌ని వారుండ‌రు. అక్కినేని నాగేశ్వరరావు త‌న‌యుడిగా తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టిన నాగ్‌.. `విక్రం` సినిమాతో హీరోగా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యాడు. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేసిన నాగార్జున రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన `శివ‌` చిత్రంలో న‌టించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నారు. ఎన్నో సంచ‌ల‌నాలు సృష్టించిన ఈ సినిమా నాగార్జున కెరీర్‌నే మ‌లుపు తిప్పింద‌ని చెప్పొచ్చు.

అలాగే మ‌జ్ను, గీతాంజ‌లి, నిన్నే పెళ్లాడ‌తా చిత్రాల‌తో ల‌వ‌ర్ బామ్ ఇమేజ్‌ను సొంతం చేసుకుని అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా మారిన‌ నాగార్జున‌.. నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా, సంతోషం సినిమాల‌తో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను... మాస్, శివ‌మ‌ణి సినిమాల‌తో మాస్ ప్రేక్షకుల‌ను... శ్రీరామదాసు, అన్నమయ్య చిత్రాల‌తో ఆధ్యాత్మిక ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

ఇక హీరోగానే కాకుండా నిర్మాత‌గానూ, హోస్ట్‌గానూ దూసుకుపోతున్న నాగార్జున‌.. ఆరు ప‌దుల వ‌య‌సులోనూ వ‌రుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోల‌కు గ‌ట్టి పోటీ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే.. గ‌త కొంత కాలం నుంచి నాగార్జున ఓ అనారోగ్య స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్నార‌ట‌. ఈ విష‌యాన్ని గ‌తంలో ఆయ‌నే స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేశారు.

ఇంత‌కీ నాగార్జున‌ను వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య ఏదో కాదు.. మోకాళ్ల నొప్పులు. సినిమాలో ఫైట్స్, డాన్స్ చేయడం వ‌ల్ల‌న మోకాళ్ల నొప్పులు ఆయ‌న్ను తీవ్రంగా వేధించేవ‌ట‌. అయితే కొంద‌రు స్నేహితుల సూచనతో స్ట్రెంత్ ట్రైనింగ్ తీసుకుని  ఆ సమస్య నుంచి ఎలాగోలా ఆయ‌న బ‌య‌ట ప‌డ్డార‌ట‌. కాగా, నాగార్జున న‌టించిన తాజా చిత్రం `బంగార్రాజు`. ఇందులో యువ సామ్రాట్ నాగ చైత‌న్య మ‌రో హీరోగా న‌టించ‌గా.. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వ‌హించారు. కృతి శెట్టి, ర‌మ్యకృష్ణ‌ హీరోయిన్లుగా న‌టించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌ల కాబోతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: