టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది హీరోయిన్ కృతి శెట్టి. తొలి సినిమాతోనే ఇంతటి స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న కథానాయిక ఇటీవల కాలంలో రాలేదనే చెప్పాలి. అలా కృతి అవతరించి అందరి దృష్టిని ఆకట్టుకుంది. తన నటనతో ప్రేక్షకులలో భారీ స్థాయిలో పాపులారిటీని అందుకుంది. ఆ సినిమాలో హీరో కంటే ఎక్కువగా ఇమేజ్ అందుకుని తన వల్లే ఇంత పెద్ద హిట్ అయ్యింది అనిపించుకుంది కృతి శెట్టి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ చిత్ర నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇవ్వడం మొదలు పెట్టారు.

 ఆ విధంగా తొలి సినిమా అలా విడుదల అయ్యిందో లేదో అరడజనుకు పైగా తెలుగు సినిమా అవకాశాలు ఆమెను వరించాయి. ఈ నేపథ్యంలోనే తొలి సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది హీరోయిన్ ల జాబితాలో చేరిపోయింది. ఆ విధంగా ఓ దశాబ్దకాలం పాటు తెలుగు సినిమా పరిశ్రమ ఏ విధంగా ఈమె వరుస సినిమాలతో రెడీగా ఉంది. అయితే తాజాగా ఆమె హీరోయిన్ గా నటించిన బంగార్రాజు చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
 
ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్రబృందం హుషారుగా పాల్గొంటుంది. ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆమె గురించి దర్శకుడు కళ్యాణ్ కృష్ణ పొగడ్తల వర్షం కురిపించాడు. అలా ఆయన పొగడడం చూస్తుంటే కొంతమంది సినిమా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు మరో సావిత్రి వచ్చిందని చెప్తున్నారు. మరి భవిష్యత్ కాలంలో ఆమెకు వచ్చే పాత్రలతో ఆమె చేసే సినిమాలను బట్టి ఆమె స్థాయి నిర్ణయించబడుతుంది కాబట్టి ఆమెకు ఆమె కెరీర్ కు ఉపయోగపడే కొన్ని మంచి సినిమా లు చేసి ఆమె స్టార్ హీరోయిన్ కావాలని ఆమె అభిమానులు ఆమెను కోరుకుంటున్నారు. మరి ఇప్పటికే ఆమె చేసిన మూడు సినిమా లు సూపర్ హిట్ అయిన నేపథ్యం లో కళ్యాణ్ కృష్ణ చెప్పిన జోస్యం నిజం అవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: