ఏది ఏమైనా తెలుగు హీరోలకు కమర్షియల్ సినిమాలంటే చాలా ఇష్టం. ఎందుకు ప్రయోగాత్మక సినిమాలు వైవిధ్య భరితమైన సినిమాలు అంటే ఆమడ దూరం ఉంటారో తెలియదు కానీ ఒక నటుడిగా తనలోని నటనని తనలోని వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలంటే తప్పకుండా ఈ ప్రయోగాత్మ క సినిమాలను చేయాలి. కమర్షియల్ సినిమాలను మాత్రమే చేస్తూ ఎవరికి సాధ్యం కానీ విధంగా మన నటులు ఎప్పుడు ఈ ప్రయోగాలను చేస్తారో తెలియదు కానీ కమర్షియల్ సినిమాల తో ఈ అదృష్టాన్ని చాలాసార్లు చేజార్చుకున్నారు.

అప్పటి తరం హీరోలలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి హీరోల దగ్గర నుంచి ఇప్పటి తరం హీరోలు ఎన్టీఆర్ నాగచైతన్యల దాకా అందరు హీరోలు కూడా కమర్షియల్ మంత్రాన్ని జపిస్తూ తమకు వచ్చిన మంచి అవకాశాలను వదులుకుంటున్నారు. కానీ తమిళ సినిమా పరిశ్రమలో హీరోలుగా ఉన్న వారి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. దేశస్థాయిలో సౌత్ సినిమా పరిశ్రమ అనగానే అందరికీ తమిళ పరిశ్రమ మాత్రమే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే కొన్ని పాత్రల ద్వారా కొన్ని సినిమాల ద్వారా ఉత్తరాదిని సైతం ఎంతగానో అలరించారు తమిళులు.
 
తమిళ సినిమా హీరోలు తమిళ సినిమాలు ఆ విధంగా గుర్తింపు తెచ్చుకోగా తెలుగు సినిమా పరిశ్రమలో ఒకటో రెండో చిత్రాలు కూడా పెద్దగా ఉత్తరాది వారి మనసును హత్తుకునే సినిమాలు రాలేదు. తెలుగు సినిమా పరిశ్రమలోని నటులు ఈ కారణం వల్ల ఎక్కువగా గుర్తింపు తెచ్చుకోకుండా పోయరు. ఇటీవల పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి కాబట్టి మన సినిమా పరిశ్రమలోనీ నటులను అందరూ గుర్తు పడుతున్నారు కాని ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో మాత్రం మన హీరోలు వెనుకబడి ఉన్నారని చెప్పవచ్చు. మరి ఇప్పుడిప్పుడే మారిన పరిస్థితులకు అనుగుణంగా సినిమాలు చేస్తున్న మన హీరోలు తొందర్లోనే ఈ రకమైన సినిమాలు చేయాలని మనం భావిద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: