టాలీవుడ్ సినిమా పరిశ్రమలో పాన్ ఇండియా సినిమాల జోరు మామూలుగా లేదు. పెద్ద హీరోల దగ్గర నుంచి చిన్న స్థాయి హీరోల దాకా ప్రతి ఒక్కరు కూడా ఈ పాన్ ఇండియా సినిమాలు చేయాలని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. దర్శకులు సైతం తమను నమ్మితే తప్పకుండా వారిని పాన్ ఇండియా హీరోలు గా ఆవిష్కరిస్తామని చెబుతూ వారితో సినిమాలు చేస్తున్నారు. నిర్మాతలు కూడా ఈ విషయం లో ఏమాత్రం తగ్గకుండా, ఖర్చుకు వెనక్కి తగ్గక పోవడం చూస్తుంటే నిజంగా వారి ధైర్యాన్ని మెచ్చుకోవాలి అనిపిస్తుంది. ఆ విధంగా తెలుగులో ఇప్పుడు టాప్ టెన్ హీరోస్ చేసే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.

అయితే ఈ పాన్ ఇండియా సినిమాలు చేయడం ఏమో కానీ ఈ సినిమాలు చేసే మోజులో మన హీరోలు వారు ఎప్పుడూ చేసే కొన్ని కొన్ని విషయాలను మర్చిపోతున్నారు అన్నది సినిమా విశ్లేషకులు చెప్పే మాట. గతంలో ఈ తరహా సినిమాలు లేని సమయంలో హీరోల మధ్య మంచి ఆసక్తికర పోటీ ఉండేది. తమ పాత్రల మధ్య మంచి వైవిధ్యత కనబరిచేవారు. ఇతర హీరోలు తమ సినిమాల్లో ఓకే రమైన పాత్ర పోలిక లేకుండా చూసుకొని వారి కంటే మంచి మంచి పాత్రలను ఎంచుకుని సినిమాలు చేసేవారు. కానీ పాన్ ఇండియా సినిమా అంటే కమర్షియల్ హీరో సినిమా కాబట్టి కథానాయకుల పాత్ర తీరు ఒకే విధంగా ఉంటుంది అన్న విమర్శలు రోజు రోజు కీ ఎక్కువగా ఎదురవుతున్నాయి.

పాన్ ఇండియా సినిమా అనగానే ప్రతి ఒక్కరూ కమర్షియల్ సినిమాగానే దాన్ని ఆలోచిస్తారు. వైవిధ్యత ప్రయోగాత్మక సినిమా గా మాత్రం అవి ఉండవు కాబట్టి పెద్ద హీరోలు ప్రయోగాత్మక సినిమాల్లో కనిపించడం అనేది జరగదు. ఆ విధంగా తమ హీరోలను తమ అభిమాన హీరోలను చూడాలనుకునే అభిమానులను ఆ ప్రయోగాత్మక పాత్రలలో చూడాలనుకునే వారు ఇది మిస్ అవుతారు. ఈ నిరుత్సాహం ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉంది. యంగ్ హీరోలు కూడా దేశవ్యాప్తంగా ఇమేజ్ రావాలి అని అనుకుంటున్నారు కాబట్టి ఈ తరహా సినిమాలు భవిష్యత్తులో ఇక రాకపోవచ్చు కానీ అంటున్నారు. కాబట్టి మన హీరోలు సదరు ప్రయోగాత్మక చేస్తే తప్పకుండా మంచి భవిష్యత్ ఉంటుంది అనేది వారి మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: