హీరో రవితేజ, హీరోయిన్ గా రిచా గంగోపాధ్యాయ, దీక్షాసేత్ కథానాయకుడిగా నటించిన చిత్రం మిరపకాయ్. ఈ సినిమాను డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చడం జరిగింది. ఈ సినిమాకి సంగీతం సంగీత దర్శకుడు థమన్ అందించాడు. ఇందులో ముఖ్య కథానాయకులుగా ప్రకాష్ రాజ్ నాగేంద్రబాబు నటించారు. ఈ సినిమా కామెడీ ఎంటర్ టైన్ మెంట్ తో బాగా సాగి పోవడంవల్లే మంచి సక్సెస్ను అందుకుంది. అందుకోసమే ఎక్కువగా రవితేజ సినిమాలను సంక్రాంతికి విడుదల చేస్తూ ఉంటారు. ఈ సినిమా 2011 వ సంవత్సరం జనవరి 13వ తేదీన విడుదల అయింది. ఈరోజుతో ఈ సినిమా విడుదలై 11 సంవత్సరాలు పూర్తి కానుంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతటి కలెక్షన్లను రాబట్టింది ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. కలెక్షన్ల విషయానికి వస్తే..

1). నైజాం-4.90 కోట్ల రూపాయలు.
2). సీడెడ్-2.85కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-1.72 కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-1.45 కోట్ల రూపాయలు.
5). వెస్ట్-1.25కోట్ల రూపాయలు.
6). గుంటూరు-1.45 కోట్ల రూపాయలు.
7). కృష్ణ-1.2 కోట్ల రూపాయలు.
8). నెల్లూరు-69 లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకుని మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే..15.33 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది.
10). రెస్ట్ ఆఫ్ ఇండియా-1.97కోట్ల రూపాయలు.
11). ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే..17.30 కోట్ల రూపాయలను రాబట్టింది.


మిరపకాయ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే..13.5 కోట్ల రూపాయల బిజినెస్ జరగగా.. ఇక ఈ సినిమా ముగిసే సమయానికి..17.30 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ సినిమాకి పోటీగా సిద్ధార్థ.. అనగనగా ఒకదీరుడు సినిమా , బాలయ్య ఒక్కమగాడు, గోల్కొండ హైస్కూల్ వంటి సినిమాలు విడుదలయ్యాయి. కానీ ఇవన్నీ విడుదల అయినప్పటికీ సంక్రాంతి బరిలో మిరపకాయ సినిమా మాత్రమే మంచి విజయాన్ని అందుకుంది. దీంతో బయ్యర్ల కి దాదాపుగా 3.8 కోట్ల రూపాయలు లాభం వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఇ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: