తెలుగులో అతి పెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ ద్వారా చాలా మందే పాపులర్ అయ్యారు. కొందరు పాపులర్ అయిన వ్యక్తులు ఆ షోలోకి వెళ్ళాక ఉన్న పాపులారిటీని పొగొట్టుకుంటే..మరికొందరు ఎటువంటి అంచనాలు లేకుండా బిగ్ బాస్ షో లో అడుగు పెట్టి తనదైన స్టైల్లో ఆట ఆడి..ఎక్స్ పోజింగ్ చేసి..నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచారు.

ఇక ఈ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉంటాది మోనల్ గజ్జర్. అమ్మడు హీరోయిన్ గా  ముందు మనకు పరిచయం ఉన్నా కానీ పెద్ద గా గుర్తింపు తెచ్చుకోలేదు. కానీ బిగ్ బాస్ షో లో అడుగు పెట్టాక వచ్చి రాని తెలుగులో మాట్లాడుతూ హోస్ట్ నాగ్ దగ్గర నుండి హౌస్ లోని కంటెస్టెంట్స్ తో పాటు..బయట ఉన్న అభిమానులని కూడా ఆకర్షించింది. అంతేనా హౌస్ లో ఉన్న ఇద్దరు టాప్ కంటెస్టెంట్స్ అయిన అభి, అఖిల్ తో లవ్ ట్రాక్ నడిపి..టాప్ 6 వరకు చేరుకుంది. అమ్మడు పర్ ఫామెన్స్ చూసి..అందరు టాప్ 5 లో ఉంటాది అని ఎక్స్ పెక్ట్ చేసారు. కానీ బిగ్ బాస్ ఆమెను వాడుకున్న అన్ని  రోజులు వాడుకుని ఫైనల్ గా ఆమెను ఎలిమినేట్ చేసి హౌస్ నుండి బయటకు పంపించేసారు.

ఇంటి నుండి బయటకు వచ్చాక అమ్మడుకి సినిమాలో ఆఫర్లు క్యూ కట్టాయని.. సెకండ్ హీరోయిన్ గా ఛాన్సులు అందుకుందని  వార్తలు కూడా వినిపించాయి. అయితే అవన్నీ కేవలం పుకార్లేనని తరువాత అర్ధమైంది. బిగ్ బాస్ తరువాత మోనల్ ఒక్కే ఒక్క ఐటెం సాంగ్ లో కనిపించింది..ఒక్క షో కి మెంటర్ గా చేసి సరిపెట్టుకుంది. అంతే ఇవి తప్ప అమ్మడు ఖాతాలో చెప్పుకొ తగ్గ సినిమాలు, షో లు ఏం లేవు. ప్రస్తుతం కొన్ని సినిమాలో చిన్న పాత్రల్లో కనిపించేందుకు సైన్ చేసిన్నట్లు టాక్ వినిపిస్తుంది.

ఇక బిగ్ బాస్ తరువాత కెరీర్ ఓ రేంజ్ లో దూసుకుపోతుందని భావించిన మోనల్ కి నిరాశే ఎదురైంది అంటున్నారు నెటిజన్స్. కనీసం అమ్మడు అందాని అయినా చూసి ఆఫర్లు నమ్మి అంటూ కొందరు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. మరి చూడాలి మోనల్ కి ఎవ్వరైన అవకాశాలు ఇస్తారు ఏమో..?

మరింత సమాచారం తెలుసుకోండి: