దూకుడు సినిమాతో మంచి సక్సెస్ మీద ఉన్నాడు మహేష్ బాబు.. ఆ తర్వాత మహేష్ బాబు నటించిన సినిమా బిజినెస్ మెన్.. ఈ సినిమా డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కించడం జరిగింది. RR మూవీ మేకర్స్ బ్యానర్ పై..RR వెంకట్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో కథానాయకుడిగా కాజల్ అగర్వాల్ నటించింది. ఈ సినిమాకి సంగీతాన్ని దర్శకుడు థమన్ ఎంతో బాగా అందించారు. మహేష్ బాబు ఈ సినిమాలో నెగెటివ్ రోల్ లో అదరగొట్టాడు అని చెప్పవచ్చు. ఒక స్టార్ హీరో ఇలాంటి పాత్ర లో కనిపించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అయితే ఇలా కనిపించి బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ గా నిలిచాడు మహేష్ బాబు. ఈ సినిమా 2012 వ సంవత్సరంలో జనవరి 13 న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. నేటితో ఈ సినిమా విడుదలై ఇప్పటికి 10 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. అయితే ఈ సినిమా ఎంతటి కలెక్షన్స్ను కొల్లగొట్టింది ఇప్పుడు ఒకసారి చూద్దాం. కలెక్షన్ల విషయానికి వస్తే..

1). నైజాం-12.40 కోట్ల రూపాయలు.
2). సీడెడ్-5.70 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-3.40కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-3.10కోట్ల రూపాయలు.
5). వెస్ట్-2.50కోట్ల రూపాయలు.
6). గుంటూరు-3.70 కోట్ల రూపాయలు.
7). కృష్ణ-2.25 కోట్ల రూపాయలు.
8). నెల్లూరు-1.35కోట్ల రూపాయలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకుని మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే..34.40 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది.
10). రెస్ట్ ఆఫ్ ఇండియా-2.50కోట్ల రూపాయలు.
11). ఓవర్సీస్ కలెక్షన్ విషయానికొస్తే..3.50 కోట్ల రూపాయలు.
12). ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే..40.40 కోట్ల రూపాయలను రాబట్టింది.

బిజినెస్ మెన్ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే..37 కోట్ల రూపాయలకు జరిగింది. ఈ సినిమా ముగిసే సమయానికి..40.40 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. దీంతో బయ్యర్లకు ఏకంగా 3.40 కోట్ల రూపాయలు లాభాన్ని చేకూర్చింది. ఈ సినిమాలో కొన్ని చోట్ల డైరెక్టుగా నిర్మాతలే విడుదల చేసుకున్నారు. దీంతో ఈ సినిమా తో నిర్మాతలు బాగా లాభాన్ని పొందాలని సమాచారం. ఈ సినిమాకు పోటీగా వెంకటేష్ బాడీగార్డ్ సినిమా విడుదల కాగా అది ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఇక సంక్రాంతి విన్నర్ గా బిజినెస్ మెన్ నిలబడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: