ప్రస్తుత్తం సినీ ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్ధితులు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా దెబ్బకి అన్నీ రంగాలతో పాటు సినీ ఇండస్ట్రీ కూడా భారీ స్ధాయిలో నష్టపోయింది. కరోనా కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడం ..సినిమా ధియేటర్స్ క్లోజ్ అవ్వడం తో ఫైనాన్షియల్ గా అందరు దెబ్బతిన్నారు. ఇక గత కొన్ని నెలలు నుండే ఏదో పరిస్ధితి చక్క పడిందిలే .. పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనుకునే తరుణంలోనే కరోనా మరోసారి విజృంభించి పరిస్ధితిని మళ్లీ ముందుకు తీసుకొచ్చింది.

ఇక  మరోవైపు దానికి తగ్గట్లే ఏపీ ప్రభుత్వం కూడా  ఏపీలో సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ జీవో జారీ  చేసింది. పలువురు సినీ హీరోలు అందరూ ఈ వివాదం పై తమదైన స్టైల్లో రెస్పాండ్ అవుతూ..జగన్ తీరు పై మండిపడ్డారు. దీంతో  పీక్ స్టేజ్ కి చేరిన ఈ మ్యాటర్ ని సాల్వ్ చేయాలి అనుకున్న జగన్ ఎట్టకేలకు చిరంజీవికి అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఇండస్ట్రీ బిడ్డగా జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్లారు.  గత కొద్దిరోజులుగా ఏపీ ప్రభత్వానికి,సినిమా ఇండస్ట్రీ వర్గాలకు మధ్య కాస్త మీతిమిరి  కామెంట్స్ వినిపిస్తున్న క్రమంలో మెగాస్టార్ చిరంజీవి.. ఏపీ సీఎం జగన్ను కలవటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే చిరు జగన్ ను కలవడం పై నాగార్జున రెస్పాండ్ అయ్యారు. ఈ విషయం నాకు వారం రోజుల ముందే తెలుసు అని చెప్పి షాక్ ఇచ్చాడు.  బంగార్రాజు సినిమా ప్రమోషన్స్ లో బిజీగా   ఉండటం వల్ల ఆయన వెళ్లలేకపోయానని చెప్పారు. జగన్‌తో మీటింగ్ ఉంటుందని..చిరంజీవి తనతో వారం ముందే చెప్పారని.. చిరంజీవి తన ఒక్కరి కోసం మాత్రమే వెళ్లలేదని..సినీ ఇండస్ట్రీ తరపున పెద్ద బిడ్డగా జగన్ ను మీట్ అవ్వడానికి వెళ్ళాడాని చెప్పుకొచ్చారు.  మరి చూడాలి ఈ ఇష్యూ పై జగన్ ఏ నిర్ణయం తీసుకుంటాడో..?

మరింత సమాచారం తెలుసుకోండి: