టాలీవుడ్ అగ్ర హీరో అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవలసిన  పని ప్రపంచవ్యాప్తంగా ఆయనకు కొన్ని లక్షల అభిమానులను సంపాదించుకున్నాడు.


ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఈ సినిమాకు గీతా గోవిందం ఫేమ్ అయిన పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ మరియు జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, 14 రీల్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. అలాగే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా తమన్ వ్యవహరిస్తున్నారని అందరికి తెలిసిందే. మహేష్ బాబు భరత్ అనే నేను, మహర్షి అలాగే సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాలతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకొని దూసుకుపోతున్నాడు.సర్కారు వారి పాట సినిమాతో త్వరలోనే మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు రానున్నాడట. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానున్నట్లు తెలుస్తుంది.ఇకపోతే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మహేష్ అభిమానులు పాపం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే షూటింగ్ లో భాగంగా మహేష్ కాలికి బాగా దెబ్బ తగలడంతో సర్జరీ కూడా జరిగిన విషయం తెలిసిందే.


 తాజాగా అందిన సమాచారం ప్రకారం సర్కారు వారి పాట సినిమా షూటింగ్ అస్సలు మహేష్ బాబు లేకుండానే జరుగుతోంది అని తెలుస్తోంది. మహేష్ బాబు కాలికి సర్జరీ అయి ప్రస్తుతం దుబాయ్ లో రెస్ట్ తీసుకుంటున్న విషయం కూడా తెలిసిందే.అంతేకాకుండా ఈమధ్య మహేష్ బాబు కి కరోనా పాజిటివ్ కూడా రాగా దీంతో ఇప్పట్లో మహేష్ బాబు షూటింగ్ లో పాల్గొనే సూచనలు అస్సలు కనిపించకపోవడంతో చిత్రబృందం మహేష్ బాబు లేని సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు అని తెలుస్తోంది.


ప్రస్తుతం సర్కారు వారి పాట షూటింగ్ వైజాగ్ బీచ్ రోడ్ లోని జగదాంబ సెంటర్ పరిసర ప్రాంతాల్లో శర వేగంగా జరుగుతున్నట్లు సమాచారం.ఇక సర్కారు వారి పాట సినిమాను ఏప్రిల్ 1న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం కూడా అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్స్ చాలా స్పీడ్ గా పూర్తి చేసేస్తోందట సినిమా యూనిట్.

మరింత సమాచారం తెలుసుకోండి: