మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన కొత్త హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెనతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. బుచ్చి బాబు డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ద్వారానే కృతి శెట్టి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిల జోడీ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఉప్పెన తర్వాత తన సెకండ్ సినిమా క్రిష్ డైరక్షన్ లో కొండపొలం తీశాడు వైష్ణవ్ తేజ్. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయ్యింది.

ఇక ఇదిలాఉంటే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తన థర్డ్ సినిమా గిరీశయ్య డైరక్షన్ లో చేస్తున్నాడు. తెలుగు అర్జున్ రెడ్డి సినిమా కు అసిస్టెంట్ గా పనిచేసిన గిరీశయ్య తమిళం లో అర్జున్ రెడ్డిని రీమేక్ చేశాడు. అతని డైరక్షన్ లో వైష్ణవ్ తేజ్ థర్డ్ సినిమా వస్తుంది. ఇక లేటెస్ట్ గా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సినిమా ఎనౌన్స్ చేశారు. వైష్ణవ్ తేజ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ప్రకటించారు.

వైష్ణవ్ తేజ్ నాల్గవ సినిమాకు మరో విశేషం ఏంటంటే ఈ సినిమా ను సితార బ్యానర్ తో పాటుగా త్రివిక్రం శ్రీనివాస్ కూడ్డా నిర్మాణ భాగస్వామ్యం అవుతున్నారు. ఈ సినిమా కు డైరక్టర్ ఎవరన్నది మాత్రం ఎనౌన్స్ చేయలేదు. వైష్ణవ్ తేజ్ కూడా వరుస క్రేజీ సినిమాలతో మెగా ఫ్యాన్స్ ని అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. మరి వైష్ణవ్ తేజ్ తో సితార బ్యానర్ ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి. ఉప్పెనతో ఫస్ట్ సినిమాతోనే మెగా ఫ్యాన్స్ కు తన సత్తా ఏంటో చూపించిన వైష్ణవ్ తేజ్ కొండపొలం నిరాశపరచినా సరే రానున్న సినిమాలతో మరోసారి తన టాలెంట్ చూపించాలని ఫిక్స్ అయ్యాడు. కథల విషయంలో కూడా ఆచి తూచి అడుగులేస్తున్నాడని తెలుస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: