ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తో నాగార్జున, చిరంజీవి ఎంత బాగా సన్నిహితంగా ఉంటారో మనకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే గతంలో జరిగిన కొన్ని భేటీలలో కూడా వీరిద్దరు కలిసి వెళ్లడం జరిగింది. అయితే వైయస్ జగన్ తో వీరిద్దరూ కలిసి కొన్ని మంతనాలు కూడా జరిపారు. కానీ తాజాగా చిరంజీవి మాత్రమే వైయస్ జగన్ మోహన్ రెడ్డి తో లంచ్ కి భేటీ అవ్వడానికి వెళ్లడంతో ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతోంది. కేవలం చిరంజీవి ఒక్కరే వెళ్లారు నాగార్జున వెళ్లలేదనే ప్రశ్న కూడా మొదలైంది.

అయితే ఈ రోజున జగన్ తో చిరు భేటీలో కొన్ని కీలక విషయాలు ప్రస్తావనకు వచ్చినట్లు గా తెలుస్తోంది. ఇక ఇదే తంతులో నాగార్జున కు పిలుపు రాలేదు అన్నది స్పష్టం అవుతోంది. కానీ.. చిరంజీవి ఫోన్ చేసి నాగార్జున కు ఈ విషయం చెప్పగా.. నాగార్జున బంగార్రాజు సినిమా పనుల్లో చాలా బిజీగా ఉన్నాను.. అందుకోసమే వైయస్ జగన్ తో, చిరు లంచ్ భేటీకి నేను హాజరుకాలేకపోయారు అని చెప్పినట్లుగా బాగా వార్తలు వినిపించాయి. కానీ ఇది వాస్తవం కాదు అన్నట్లుగా సమాచారం. కేవలం జగన్ చిరంజీవి కి మాత్రమే లంచ్ మీటింగ్ కి పిలిచారు అన్నదిగా ఇండస్ట్రీలో టాక్ గా వినిపిస్తోంది. ఇక అంతే కాకుండా ఈ విషయంలో నాగార్జున భలే కవరింగ్ చేశాడన్నట్లుగా  కూడా కొంతమంది నెటిజన్లు తెలియజేయడం జరుగుతోంది.

వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి చిరంజీవి అంటే చాలా ఇష్టం ఉండటంతో ఆయన ఒక్కరితోనే సినీ పరిశ్రమలో ఉండే ప్రధాన అంశాల గురించి మాట్లాడుకున్నట్లు గా సమాచారం. ఇక అంతే కాకుండా ఈ భేటీ అనంతరం చిన్న సినిమాలకు ఐదు షోల వరకు అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది.ఇక అంతే కాకుండా మోహన్ బాబు కూడా జగన్ తో భేటీ అయి మాట్లాడాలని చూశారు. కానీ ఇంతలోనే చిరంజీవి వచ్చి మాట్లాడడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: