టాలీవుడ్ లో ప్రస్తుతం సూపర్ ఫాం లో ఉన్న థమన్ వరుస స్టార్ సినిమాలతో దుమ్ముదులిపేస్తున్నాడు. సినిమాలకు మ్యూజిక్ ఇవ్వడమే కాదు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కూడా సత్తా చాటుతున్నాడు థమన్. స్టార్ సినిమాలే కాదు మీడియం బడ్జెట్ సినిమాలకు కూడా థమన్ తన మ్యూజిక్ తో అదరగొట్టేస్తున్నాడు. ఇక ఇంత బిజీగా ఉన్న థమన్ ఓ సింగింగ్ రియాలిటీ షోకి జడ్జ్ గా ఒప్పించారు అల్లు అరవింద్. ఆహాలో రాబోతున్న ఇండియన్ ఐడల్ తెలుగు షోకి జడ్జ్ గా థమన్ వ్యవహరించనున్నారని తెలుస్తుంది.

ఈ షోకి హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టంట్ ఒకప్పటి ఇండియన్ ఐడల్ విన్నర్ శ్రీరాం చంద్ర చేస్తారని తెలుస్తుంది. శ్రీరాం చంద్ర హోస్ట్.. థమన్ జడ్జ్ గా ఇండియన్ ఐడల్ తెలుగు షో ఆహాలో రానుంది. ఈ షో జడ్జ్ గా చేసేందుకు గాను థమన్ భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఎపిసోడ్ వైజ్ గా జరిగే ఈ కాంపిటీషన్ లో థమన్ తన రెమ్యునరేషన్ కూడా ఎపిసోడ్ ఎపిసోడ్ వైజ్ తీసుకుంటున్నాడని టాక్.

ఎలాగు ఇప్పుడు టాలీవుడ్ లో మంచి ఫాం లో ఉన్న థమన్ అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తున్నారట అహా టీం. ఆహాలో రాబోతున్న ఇండియన్ ఐడల్ తెలుగు ద్వారా ఎంతోమంది కొత్త సింగర్స్ కు అవకాశం ఇవ్వనున్నారు. ఇప్పటికే దీనికి సంబందించిన ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలుస్తుంది. జీ సరిగమప కి పోటీగా ఆహా ఇండియన్ ఐడల్ తెలుగు షో రానుంది. థమన్ జడ్జ్ గా చేయబోతున్న ఈ షో చాలా స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఈ షో స్టార్ట్ అవకముందే సూపర్ క్రేజ్ రాగా ఇప్పుడు థమన్ జడ్జ్ గా అనేసరికి ఇంకాస్త బజ్ ఏర్పడింది. తప్పకుండా ఇండియన్ ఐడల్ తెలుగు మంచి సింగర్స్ ని పరిచయం చేయడమే కాకుండా ప్రేక్షకులను అలరించే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.
మరింత సమాచారం తెలుసుకోండి: