పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి చేస్తున్న మల్టీస్టారర్ సినిమా భీమ్లా నాయక్. మళయాళ సూపర్ హిట్ మూవీ రీమేక్ గా వస్తున్న ఈ సినిమా త్రివిక్రం చెప్పబట్టే పవన్ చేసేందుకు రెడీ అయ్యాడు. సితార బ్యానర్ లో సాగర్ చంద్ర డైరక్టర్ గా పెట్టి వెనక కథ మొత్తం త్రివిక్రం నడిపిస్తున్నాడు. భీమ్లా నాయక్ సినిమాకు త్రివిక్రం స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నట్టు తెలిసిందే. సినిమా షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

ఈ క్రమంలో భీమ్లా నాయక్ ఎడిటింగ్ టైం లో తివిక్రం తను చెప్పినట్టుగా ఎడిట్ చేయమని చెబుతున్నాడట. డైరక్టర్ సాగర్ చంద్రని పక్కన పెట్టి మరి త్రివిక్రం ఎడిటింగ్ బాధ్యత మీద వేసుకున్నాడని అంటున్నారు. సాగర్ చంద్ర డైరక్టర్ గా తన టాలెంట్ చూపించినా షూటింగ్ వరకు మాత్రమే ఆయన డైరక్టర్ గా పనిచేయించి.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం త్రివిక్రం దగ్గర ఉండి చూసుకుంటున్నాడని తెలుస్తుంది.

పవన్ సినిమా అంటే త్రివిక్రం మీద అదనపు బాధ్యత ఉన్నట్టే. అదీగాక సితార బ్యానర్ సినిమా అంటే అది సొంత బ్యానర్ సినిమా అన్నట్టే. ఈ కారణాల చేత త్రివిక్రం భీమ్లా నాయక్ సినిమా పూర్తి బాధ్యత మీద వేసుకున్నాడు. మరి అదేదో త్రివిక్రమే డైరక్షన్ కూడా చేస్తే పోలా అన్న టాక్ వినిపిస్తుంది. అయితే త్రివిక్రం సినిమా తీయడం అంటే మళ్లీ అంతా సెట్ చేసుకోవాలి అందుకే డైరక్షన్ వరకు మరొకరికి ఇచ్చి మిగతా పనులన్ని తను చూసుకుంటున్నాడట. సో అలా చెప్పుకుంటే భీమ్లా నాయక్ డైరక్టర్ గా పేరు సాగర్ చంద్రదే అయినా పనితనం మాత్రం త్రివిక్రం దే అవుతుందని అంటున్నారు. సంక్రాంతికి రిలీజ్ అనుకున్న భీమ్లా నాయక్ ప్రస్తుతం ఫిబ్రవరి 25 రిలీజ్ మార్చారు. అయితే అప్పటికైనా సినిమా వస్తుందా రాదా అన్న డౌట్ ఆడియెన్స్ లో ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: