సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో విడుదలైన పుష్ప సినిమాలో అన్ని పాటలు ప్రేక్షకులను ఆకర్షించాయి. అన్నింటికంటే అంతకుమించి అనే రేంజ్ లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకునీ మత్తెక్కించిన పాట సమంత ఐటెం సాంగ్ అనే చెప్పాలి.  ఊ అంటావా ఉహూ అంటావా అంటూ సాగిపోయే పాట అందరికీ కిక్కు ఎక్కించింది. ఇక ఈ సినిమాలో సమంత తన కిల్లింగ్ ఎక్స్ ప్రెషన్ తో అటు ప్రేక్షకులు అందరి మతి పోగొట్టింది అనే చెప్పాలి. పుష్ప సినిమాకు సమంత ఐటమ్ సాంగ్ ఎంతగానో ప్లస్ పాయింట్ గా మారిపోయింది. అయితే ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప సినిమాలోని ఊ అంటావా ఉహూ అంటావా అనే సాంగ్ వినిపిస్తోంది.



 ఎంతో మంది ప్రేక్షకులు దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ ఇక ఈ పాటపై డాన్స్ లు చేసి ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండటం గమనార్హం. ఇకపోతే ఇటీవలే సంక్రాంతి కానుకగా ఈటీవీలో ప్రసారం కాబోయే 'అమ్మమ్మగారి ఊరు ' అనే ఈవెంట్లో భాగంగా యాంకర్ రష్మి ఊ అంటావా ఉహూ అంటావా అనే పాటకి అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో అందరూ రష్మి గురించి చర్చించుకోవడం మొదలు పెట్టారు.. కోర చూపులతో రష్మీ చేసిన పర్ఫామెన్స్ చూడటానికి అందరూ సిద్ధమైపోయారు.


 అయితే యాంకర్ రష్మీ చేసిన తర్వాత నేనేమైనా తక్కువ అనుకుందో ఏమో ఇక ఇప్పుడు యాంకర్ విష్ణు ప్రియ కూడా ఇదే పాట పై హాట్ హాట్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి ప్రేక్షకులందరికీ మత్తెక్కిస్తోంది. ఇటీవలే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలయింది. ఈ ప్రోమో లో భాగంగా ఊ అంటావా ఉహూ అంటావా అనే పాట పై విష్ణుప్రియ అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది. రష్మీ అనుకుంటే విష్ణుప్రియ అంతకుమించి అనే రేంజ్ లోనే హాట్ పర్ఫామెన్స్ చేయడం గమనార్హం. ఇంకెందుకు ఆలస్యం ఈ ప్రోమో మీరు కూడా చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: