ఫెస్టివల్ వచ్చింది అంటే థియేటర్లు ఎలా కళకళలాడుతాయో ఇంట్లో ఉన్న లేడీస్ ని ఎంటర్టైన్ చేసేందుకు టీవీ ఛానెళ్లు అలానే పోటీ పడతాయి. వెండితెర మీద సినిమాల పోటీ.. బుల్లితెర మీద ప్రోగ్రాం ల పోటీ సహజమే. వేటికవి ప్రత్యేకంగా నిలిచేలా ఆ ఛానెల్ లో ఉన్న క్రేజీ ఆర్టిస్టులతో రకరకాల షోస్ ప్లాన్ చేస్తారు. ఎప్పటిలానే సంక్రాంతికి ఈటీవీ వర్సెస్ స్టార్ మా వర్సెస్ జీ తెలుగు పోటీకి దిగుతున్నాయి. సంక్రాంతి సంబరాల షోలతో సత్తా చాటాలని చూస్తున్నారు.

ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్లు సంక్రాంతికి స్పెషల్ షో ప్లాన్ చేయగా జీ తెలుగులో కూడా సంక్రాంతికి స్పెషల్ ఈవెంట్ ఫిక్స్ చేశారు. స్టార్ మా కూడా సంక్రాంతి సందడికి రెడీ అయ్యింది. అయితే ఈ ఈవెంట్స్ లో ఈసారి ఒకే ఒక కామన్ పాయింట్ మాత్రం జరుగుతుంది. స్పెషల్ షోస్ లో స్కిట్లు, సాంగ్స్ తో పాటుగా డ్యాన్సులు కామనే. ఈసారి సంక్రాంతికి ఉ అంటావా సాంగ్ ని బుల్లితెర భామలు ఆడి పాడుతున్నారు.

ఈటీవీలో విష్ణు ప్రియ, జీ తెలుగులో పూర్ణ ఉ అంటావా సాంగ్ తో ఊపేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో సమంత స్పెషల్ గా చేసిన ఉ అంటావా సాంగ్ ఇప్పటికే సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇప్పుడు సంక్రాంతికి బుల్లితెర మీద కూడా ఈ సాంగ్ ఓ రేంజ్ లో ఊపేసేందుకు సిద్ధమైంది. భామలు వేరు.. స్టెప్పులు వేరు.. కానీ ఉ అంటావా మావా సాంగ్ మాత్రం ఒకటి. సమంత చేసిన ఈఎ సాంగ్ ని ఇంతమంది భామలు రెచ్చిపోతూ చేస్తుంటే ఆడియెన్స్ కూడా ఉ అనకుండా ఉండగలరా చెప్పండి. మొత్తానికి సమంత చేసిన ఈ సాంగ్ ఈ రేంజ్ లో సూపర్ డూపర్ హిట్ అవడం అమ్మడికి మంచి బూస్టింగ్ ఇచ్చిందని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: