ప్రముఖ టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన తాజా చిత్రం 'రౌడీ బాయ్స్'. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.'హుషారు' ఫేమ్ హరీష్ కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది.ఇక ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోకి డీప్ గా లిప్ లాక్ ఇచ్చిన సీన్ పెద్ద హైలైట్ గా నిలిచింది. ఇప్పటివరకు కూడా తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా కానీ అనుపమ ఎప్పుడూ ఎలాంటి హద్దులు అనేవి దాటలేదు. గ్లామర్ షోకి ఇంకా అలాగే ఇంటిమేట్ సన్నివేశాలకు చాలా దూరంగా ఉంటుంది.అలాంటిది ఆమె లిప్ లాక్ సీన్స్ లో రెచ్చి పోవడంతో అభిమానులతో ఆడియన్స్ కూడా షాకయ్యారు. ట్రైలర్ విడుదలయిన వెంటనే అనుపమ పరమేశ్వరన్ ముద్దు సీన్ పై చాలా మీమ్స్ ను వారు క్రియేట్ చేశారు.

సోషల్ మీడియాలో కూడా ఈ మీమ్స్ బాగా వైరల్ అయ్యాయి.ఇక తాజాగా ఈ లిప్ లాక్ మీమ్స్ పై స్పందించింది అనుపమ పరమేశ్వరన్. 'రౌడీబాయ్స్'లో జంటగా నటించిన ఆశిష్ ఇంకా అనుపమ ఆ మీమ్స్ ను చూసి అభిమానుల క్రియేటివిటీ చూసి బాగా నవ్వుకున్నారు.ఇక ఆ తరువాత అనుపమ పరమేశ్వరన్ లిప్ లాక్ సీన్స్ సినిమాలో ఒక భాగం మాత్రమేనని అభిమానులకు ఆమె చెప్పే ప్రయత్నం చేసింది.ఇక సినిమాలో తన పాత్రను ముద్దు పెట్టింది కేవలం ఆశిష్ పాత్ర అని చెప్పింది. అలాగే సినిమాలో ఆ సీన్స్ చూసిన తరువాత నెటిజన్లు మనసు కూడా మార్చుకుంటారని ఈ జంట హామీ ఇవ్వడం జరిగింది.ఇక ఈ మేరకు దీనికి సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేసింది.ఈ లిప్ లాక్ సీన్స్ ను కూడా ప్రమోషన్స్ కోసం వాడేసుకుంది ఈ 'రౌడీబాయ్స్' టీమ్.ఇక సంక్రాంతి పండుగకు రానున్న ఈ సినిమా ఎలాంటి సూపర్ హిట్ ని అందుకుంటుందో చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: