రన్‌ రాజా రన్‌’ అంటూ టాలీవుడ్‌లో కొత్త రకం సినిమాను తీసుకొని వచ్చాడు సుజీత్‌. మరీ కొత్త అని కాదులే కానీ అప్పటివరకు కామెడీ మరియు క్రైమ్‌ కామెడీ అంటే ఒకే రకం అలవాటుపడ్డ జనాలకు డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేతో సరికొత్త సినిమా అయితే చూపించాడు. ఆ తర్వాత ప్రభాస్‌తో ‘సాహో’ లాంటి సినిమా యాక్షన్ సినిమా చేసే అవకాశం పొందాడు . చిన్న సినిమాగా మొదలైన ‘సాహో’‘బాహుబలి’ ప్రభావంతో పాన్‌ ఇండియాగా మారి… భారీ చిత్రం అయ్యి కూర్చుంది. అలాంటి సినిమా ఇచ్చిన సుజీత్‌ అస్సలు ఇప్పుడేం చేస్తున్నాడు. ఇప్పుడు టాలీవుడ్‌లో దేనిమీదే పెద్ద చర్చ నడుస్తోంది.

నిజానికి చిరంజీవి ‘లూసిఫర్‌’ రీమేక్‌ ఛాన్స్‌ సుజీత్‌కి ఇచ్చారని వార్తలు కూడా వచ్చాయి.అయితే ఆ కథను సుజీత్‌ చిరంజీవికి నచ్చినట్లుగా మలచలేకపోయాడనే పుకార్లు కూడా చాలానే వచ్చాయి. అనుకున్నట్లుగానే ఆ సినిమా ఛాన్స్‌ ఆయన కోల్పోయాడు. ఆ తర్వాత ఒకరిద్దరు హీరోలకు కథలు చెప్పినట్లు సమాచారం.. అవేవీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. బెల్లంకొండ శ్రీనివాస్‌ ‘ఛత్రపతి’ సినిమాను కూడా ముందుగా ఆయనే చేస్తాడని కూడా వార్తలొచ్చాయి. అది కూడా ఓకే అవ్వలేదట.. దీంతో అసలు సుజీత్‌ ఏం చేస్తున్నాడు అనే ప్రశ్న అందరికి మొదలైంది.


రెండు మంచి హిట్లు అందించిన సుజీత్‌ ఇప్పుడు ఖాళీగా ఉండటమేంటి అనే ప్రశ్న కూడా అందరిలో వస్తోంది. ప్రస్తుతం సుజీత్‌ ముంబయిలో ఉన్నాడని తెలుస్తుంది.. అక్కడ తన టీమ్‌తో ఓ సినిమా కథ పని మీద కూర్చున్నాడని సమాచారం.. అయితే కన్నడ స్టార్‌ సుదీప్‌తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడనే వార్త కూడా వినిపిస్తోంది. ఇందులో తొలి టాక్‌కే ఓటేయొచ్చు అని అందరూ అంటున్నారు. తెలుగు హీరోలు అంతా హ్యాండ్‌ ఇస్తున్న నేపథ్యంలో డైరెక్ట్‌గా బాలీవుడ్‌ హీరోతోనే సినిమా చేద్దాం అని కూడా అనుకుంటున్నాడట. దాని కోసమేనట ఈ ప్రయత్నాలు అని తెలుస్తోంది.

ప్రభాస్‌కి సుజీత్‌ అంటే చాలా ఇష్టమని అందుకే రెండు సినిమాలు యూబీ క్రియేషన్స్‌ బ్యానర్‌ మీద చేసే అవకాశం ఇచ్చాడని ఇప్పుడు మరో అవకాశం ఎందుకు ఇవ్వడం లేదనే టాక్ కూడా నడుస్తుంది.. ఒకవేళ ఇద్దామన్నా కూడా అక్కడ ప్రభాస్‌ ఖాళీగా అస్సలు లేడు. వరుస సినిమాలతో ప్రభాస్ చాలా బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సుజీత్‌కి హీరో దొరకాలి ఆ హీరోకి కథ నచ్చాలి ఆ సినిమా ముందుకెళ్లాలి.చూద్దాం సుజీత్‌ నెక్స్ట్‌ అస్సలు హీరో ఎవరవుతారో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: