2022 వ సంవత్సరం స్టార్ట్ అయ్యి 12 రోజులు పూర్తయినప్పటికీ.. ఇంకా టాలీవుడ్ పరిశ్రమ హిట్టు మొహం చూడలేదు. ఈ సంక్రాంతి పండక్కి 'ఆర్.ఆర్.ఆర్' 'రాధే శ్యామ్' 'భీమ్లా నాయక్' వంటి పెద్ద చిత్రాలతో బాక్సాఫీస్ కళకళలాడుతుంది అనుకుంటే 'అతిథి దేవో భవ' ఇంకా '1945' సినిమాలతో చాలా నీరసంగా స్టార్ట్ అయ్యింది. ఇక ఈ సంక్రాంతి పండగకి 'బంగార్రాజు' ఒక్కటే పెద్ద సినిమా. మిగిలినవి అన్నీ కూడా చిన్నా చితకా సినిమాలే..! అయితే ఇద్దరు కొత్త హీరోలు ఈ సంక్రాంతి పండగకు టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు.ఒకరు దిల్ రాజు తమ్ముడు కొడుకు ఆశిష్ రెడ్డి కాగా మరొకరు సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అయిన అశోక్ గల్లా. 'రౌడీ బాయ్స్' తో ఆశిష్ ఇంకా అలాగే 'హీరో' అంటూ అశోక్ గల్లా ప్రేక్షకులను పలకరించబోతున్నారు. 'రౌడీ బాయ్స్' .. జనవరి 14 వ తేదీన విడుదల కాబోతుండగా, 'హీరో' సినిమా జనవరి 15 వ తేదీన విడుదల కాబోతుంది. ఇక ఈ ఇద్దరు డెబ్యూ హీరోల్లో హిట్టు కొట్టి సంక్రాంతి హీరో ఎవరు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

ఇక ఈ ఇద్దరు హీరోల సినిమాల ట్రైలర్లు అయితే చాలా బాగున్నాయి.అలాగే ఇద్దరికీ స్టార్ హీరోయిన్లతో రొమాన్స్ ఇంకా లిప్ లాక్ లు పెట్టుకునే ఛాన్స్ కూడా దక్కింది. అయితే 'రౌడీ బాయ్స్' సినిమాని దిల్ రాజు నిర్మించాడు. అతని బ్యానర్ నుండీ వచ్చే సినిమా అంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉంటాయి.ఇక అంతేకాకుండా 'బంగార్రాజు' సినిమా కంటే కూడా ఎక్కువ థియేటర్లను సొంతం చేసుకుంది 'రౌడీ బాయ్స్' సినిమా. ఇక హీరో సినిమా ఒకరోజు ఆలస్యంగా విడుదలవుతుంది కాబట్టి..థియేటర్లు కూడా ఎక్కువ దొరికే అవకాశం లేదు. ఇక్కడ 'హీరో' సినిమాతో పోలిస్తే 'రౌడీ బాయ్స్' సినిమాకే ఎక్కువ ప్లస్ లు ఉన్నాయి. ఇక బాక్సాఫీస్ వద్ద కూడా 'రౌడీ బాయ్స్' టార్గెట్ రూ.10 కోట్లు ఇంకా 'హీరో' సినిమా టార్గెట్ రూ.8 కోట్లు ఉంది.

కాని ఆశిష్ కంటే కూడా ఇక్కడ అశోక్ కే సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఆశిష్ పైన దిల్ రాజు పైన సోషల్ మీడియాలో ఇప్పటికే అనేక రకాలుగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. నిజానికి హీరో ట్రైలర్ ఆడియన్స్ కి రౌడీ బాయ్స్ సినిమా ట్రైలర్ తో పోలిస్తే చాలా కొత్తగా బాగా అనిపించింది. పైగా సూపర్ స్టార్ కాంపౌండ్ కావటంతో తక్కువ థియేటర్స్ దక్కిన కాని ఆడియన్స్ హీరోకే ఓటు వేసేలా వున్నారు. కాని ఏ సినిమా సంక్రాంతి విన్నర్ అవుతుందో రిలీజ్ అయితే కాని చెప్పలేము.

మరింత సమాచారం తెలుసుకోండి: