తక్కువ సినిమాలే చేసినా కూడా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోలలో విశ్వక్ సేన్ ఒకరని చెప్పవచ్చు.. తన సినిమాలలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా జాగ్రత్త పడుతున్న విశ్వక్ సేన్ గత సినిమా పాగల్ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచి అతడిని నిరాశ పరిచింది

ఫలక్ నుమా దాస్ మరియు హిట్ సినిమాలతో విజయాలను అందుకున్న విశ్వక్ సేన్ పాగల్ ఫలితంతో బాగా నిరాశ చెందారు. అయితే ఈ హీరో తన కొత్త సినిమాను మాత్రం చాలా వెరైటీగా ప్రమోట్ చేసుకుంటున్నారు.

విశ్వక్ సేన్ హీరోగా అశోకవనంలో అర్జున కళ్యాణం పేరుతో ఒక సినిమా తెరకెక్కుతోందన్నా విషయం అందరికి తెలిసిందే. కొన్నిరోజుల క్రితం పెళ్లి కొరకు చింతా మ్యారేజ్ బ్యూరోను సంప్రదించానని విశ్వక్ సేన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఆ ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన కూడా వచ్చింది. తాజాగా విశ్వక్ సేన్ రెండు రోజుల సమయం మాత్రమే ఉందని పిల్లని వెతికిపెట్టాలని ఒకవేళ పిల్లను వెతికిపెట్టడం సాధ్యం కాకపోతే కనీసం అమ్మాయిని పడేసే చిట్కాలు అయినా సరే ఇవ్వాలని ట్వీట్ లో పేర్కొన్నారట..

#helpallamfindpellam హ్యాష్ ట్యాగ్ తో సూచనలను తెలియజేయాలని విశ్వక్ సేన్ తన పోస్ట్ లో చెప్పుకొచ్చారట.

వయస్సు మూడు పదులు దాటేసిందని జుట్టు మరియు పొట్ట ఇలా అనేక కష్టాలు తనకు ఉన్నాయని ఒక్క సంబంధం చూసి అల్లానికి పెళ్లాన్ని వెతికిపెట్టడంలో సాయం చేయాలని విశ్వక్ సేన్ ట్వీట్ తో పాటు షేర్ చేసిన వీడియోలో చెప్పుకొచ్చారట.. విశ్వక్ సేన్ ప్రమోషన్స్ సినిమాకు ఎంతవరకు ప్లస్ అవుతాయో చూడాలి మరి.
ఈ నెల 15వ తేదీన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా నుంచి పెద్ద అప్ డేట్ వస్తుందని విశ్వక్ సేన్ చెప్పకనే చెప్పేశారు. ఈ సినిమా నుంచి సంక్రాంతి కానుకగా టీజర్ లేదా ట్రైలర్ రిలీజయ్యే ఛాన్స్ ఉందని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. బాపినీడు సుధీర్ ఈదర ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: